తన భార్య అందాన్ని పొగుడుతూ అల్లు అర్జున్ హాట్ కామెంట్స్!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన భార్య స్నేహారెడ్డి ఫోటో షేర్ చేసిన బన్నీ.... ఆమె అందాన్ని పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవిత భాగస్వామిని బన్నీ ఎంతలా ప్రేమిస్తాడో, ఏ స్థాయిలో ఆరాధిస్తాడో ఈ పోస్టు ద్వారా చెప్పకనే చెప్పారు. ఇంతలా ప్రేమించే బన్నీ లాంటి భర్త దొరకడం స్నేహారెడ్డి అదృష్టమే మరి!
స్టైలిష్ స్టార్ అభిమానులు ఈ పోస్టును లైక్స్, కామెంట్లతో ముంచెత్తారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంత అందమైన అమ్మాయిని పెళ్లాడానా?
‘ఓ మై గాడ్..ఇంతటి అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానా.... నమ్మలేకపోతున్నాను' అంటూ అల్లు అర్జున్ తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
గతంలోనూ తన భార్య గురించి...
గతంలో కూడా అల్లు అర్జున్ తన భార్య గురించి హాట్ కామెంట్స్ చేశారు. ‘‘ఒకానొక సమయంలో కెరీర్, ప్రేమ ఏది ఎంచుకోవాలనే సందిగ్ధ పరిస్థితిలో కొట్టుమిట్టాడానని, ఆ సమయంలో స్నేహారెడ్డిని మిస్సవుతానేమో అని భయపడ్డానని అల్లు అర్జున్ వెల్లడించారు.

‘దేశముదురు’ సినిమా సమయంలో
ఓసారి తనకు ఒక పెద్ద సమస్య వచ్చిందని, ప్రియురాలు స్నేహారెడ్డి వద్దకు వెళ్లాలా? లేక ‘దేశ ముదురు' షూటింగ్ కోసం మనాలి వెళ్లాలా? అనే అయోమయం తలెత్తిందని తెలిపాడు. రెండింటిలో ఏదైనా ఒకటే ఎంచుకునే క్రమంలో చాలా తికమకపడ్డాను. అయితే ముందు మనాలి వెళ్లడంతో పాటు... స్నేహ ప్రేమను పొందాను అని గతంలో ఓసారి గుర్తు చేసకున్నారు.

సినిమాల విషయానికొస్తే...
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత ఏ సినిమా చేయాలనే విషయంలో బన్నీ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. రోటీన్ సినిమాలు కాకుండా భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని, కాస్త లేటైనా భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంలో న్నారు. త్వరలో అల్లు అర్జున్ విక్రమ్ కె కుమార్ ప్రాజెక్టుకు ఓకే చెప్పే అవకాశం ఉందని, నల్లమలుపు బుజ్జి, నాగ అశోక్ కుమార్ ఈ మూవీని నిర్మించ బోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం అఫీషియల్ ఖరారు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











