For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  One Year Of Josh app: ఏక్ నంబర్ ఛాలెంజ్‌లో 50000 గెలుచుకొనే అవకాశం.. టాప్ సెలబ్రిటీలతో కలిసే ఛాన్స్ ఇలా!

  |

  ఇండియాలోని అతిపెద్ద షార్ట్ వీడియో మేకర్ యాప్ జోష్ కంటెంట్ కమ్యూనిటీలోని ప్రభావిత వ్యక్తులు, వర్థమాన ప్రతిభావంతుల కలయికతో అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో భారీ హిట్‌గా నిలిచింది. కరోనా లాంటి సంక్షోభ సమయాల్లో #BlueWarrior లాంటి విశేషమైన కార్యక్రమాలతోపాటు కంటెంట్ క్రియేటర్లలోని అంతర్గతంగా ఉన్న క్రియేటివిటిని తట్టిలేపడానికి వినూత్నమైన కార్యక్రమాలను డిజైన్ చేస్తూ బిగ్గెస్ట్ బ్రాండ్స్, సెలబ్రిటీలను జోష్ యాప్ మమేకం చేస్తున్నది. సృజనాత్మకమైన పంథాలో నెటిజన్లను చేరుకొనేలా జోష్ వీడియో దేశవ్యాప్తంగా వివాదాలకు తావులేకుండా కార్యక్రమాలను రూపొందిస్తున్నది.

  ఆగస్టు 2021 నాటికి జోష్ యాప్ ఏడాది పూర్తి చేసుకొంటూ సరికొత్త మైలురాయిని చేరుకొన్న సమయంలో Ek Number అనే స్పెషల్ ఛాలెంజ్ పోటీని నెటిజన్ల ముందుకు తీసుకొచ్చింది. ఈ వేడుకను ఆగస్టు 20వ తేదీన లైవ్ కార్యక్రమంగా మలచడమే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమలో టాప్ యాక్టర్లు సోనుసూద్, మౌనీ రాయ్ లాంటి ప్రముఖులను వినోదభరితమైన ఈవెంట్లలో భాగం చేసింది.

  దేశంలోని ఎనిమిది భాషల్లోని టాప్ ప్రభావవంతులను ఈ వేదికపైకి తీసుకొస్తూ డ్యాన్స్, ఫుడ్, ఫ్యాషన్, కామెడీ, ఫిట్‌నెస్ లాంటి విభాగాల్లో సోనుసూద్, మౌని రాయ్ ఇద్దరూ Ek Number ఛాలెంజ్‌ను ఉత్తేజకరంగా మార్చారు. ఇందులో పాల్గొనే ఔత్సాహికులు తమకు నచ్చిన కేటగిరీలలో ఛాలెంజ్ వీడియోను పోస్టు చేయాల్సి ఉంటుంది. జోష్ యాప్‌లో ఉండే టాప్ ఇన్‌ఫ్లూయన్సర్లు 20 తేదీ నుంచి 26వ తేదీ ఆగస్టు వరకు ప్రతీ రోజు జోష్ ఇన్స్‌టాగ్రామ్ హ్యాండిల్‌లో లైవ్ ప్రరద్శనలు నిర్వహిస్తారు. ఐదు విభాగాల్లో ఎవరెవరూ, ఏ క్యాటగిరీలో ఉంటారంటే...

  One Year Of Josh: Golden Chance to win 50000, Sonu Sood, Mouni Roy are part of the #EkNumber Challenge

  ఫిట్‌నెస్: అద్నాన్ సమీ, ఫయాజ్, ఫయాసు, బిజ్లీ మురళీ
  కామెడీ: ఓయే ఇట్స్ ప్రాంక్, సమీక్ష, విశాల్ పరేఖ్, సుకైనా సుల్తాన్, హస్నైన్
  డ్యాన్స్: ఇషాన్, సనా సుల్తాన్ ఖాన్, ప్రిన్స్ గుప్తా, మహక్ మఘానీ, దీపక్ తుల్స్యాన్
  ఫుడ్: మధుర, ఫజల్, మింట్ రిసైప్, దివిన్, కారుణ్య
  ఫ్యాషన్: షాదాన్, విశాల్ పాండే, క్రిష్ గవాలీ, భవిన్, వైష్ణవీ నాయక్

  Ek Number ఛాలెంజ్‌లో కేపీవై బాలా, కింగ్స్ యునైటెడ్-సురేస్, రుహీ సింగ్ లాంటి ప్రముఖులు భాగస్వామ్యం కానున్నారు. అంతేకాకుండా 10 రోజులపాటు సాగే ఈ పోటీల్లో సృజనాత్మకమైన ఐడియాస్‌తో ఆకట్టుకొనే 120 మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను ఎంపిక చేస్తారు.

  'Ek Number ఛాలెంజ్‌లో ఎలా పాల్గొనాలంటే

  పైన తెలియజేసిన కేటగిరీలలో తమకు నచ్చిన విభాగంలో కింద తెలియజేయబడిన హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగిస్తూ తమ వీడియోలను పోస్టు చేయాలి.

  #EkNumber
  #EkNumberFitnessStar
  #EkNumberComedyStar
  EkNumberDanceStar
  #EkNumberFoodStar
  #EkNumberFashionStar

  ఈ ఛాలెంజ్‌లో పాల్గొనే ముందు మీ వీడియోలు మరింత ఎక్సైటింగ్ ఉండటానికి జోష్ ఐజీ ఫిల్టర్ యాప్‌ను ఉపయోగించడం మరిచిపోవద్దు.

  భారీ మొత్తంలో గెలుచుకొనే ఛాన్స్ ఇలా..
  జోష్ యాప్ నిర్వహించే #EkNumber ఛాలెంజ్‌లో విజేతలు నిలిచే వారికి జోష్ ఆల్ స్టార్స్, ఏక్ నంబర్ కంటెంట్ క్రియేటర్‌లో ఎన్‌రోల్ చేసుకొనే అవకాశం దక్కుతుంది. అంతేకాకుండా విజేతలు రూ.50000 క్యాష్ ప్రైజ్ గెలుచుకొనే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా టాప్ సెలబ్రిటీలను, రోల్ మోడల్స్‌ను కలుసుకొనే గోల్డెన్ ఛాన్స్ కూడా ఉంటుంది.

  తొలి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మ్యూజికల్ టచ్‌ను కూడా జోష్ యాప్ అందించింది. పాపులర్ మ్యూజికల్ టాలెంట్స్ క్లింటన్ సెరేజో, బియానికా గోమ్స్ రూపొందించిన జోష్ మే ఆజా అనే ఏక్ నంబర్ జోష్ యానివర్సిటీ వీడియోను యూజర్లకు అందించింది. ఏక్ నంబర్ జోష్ వార్షికోత్సవ మిక్స్ వినడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

  ఏక్ నంబర్ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. విజేతలుగా నిలువండి.

  English summary
  Josh completes a year in August 2021. To celebrate this achievement, the app has announced a special challenge titled 'Ek Number', which goes live today (August 20, 2021). Josh has roped in two of India's most popular movie stars, actors Sonu Sood and Mouni Roy to add some starry glitter to this fun-filled contest.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X