ప్రభాస్, చిరులను వెనక్కినెట్టిన మహేష్.. సర్వేలో టాప్.. ట్విట్టర్‌లో ఫ్యాన్స్ వార్
సినిమా రంగంలో ఓ పరుగు పందెం ఉంటుంది. అయితే ఇది హీరోలు వారికి వారు పెట్టుకోరు. కానీ తమ హీరో గొప్ప అంటే కాదు కాదు తమ హీరోనే గొప్ప అంటూ అభిమానులు వాగ్వాదానికి దిగుతుంటారు. ఇలా వారిలో వారే మా హీరో నెంబర్ వన్ అంటూ కాలర్ ఎగిరేస్తారు. అయితే కొన్ని లెక్కల దృష్ట్యా, సినిమాల సక్సెస్ రేట్, లాభాలను ఎక్కువగా తెచ్చే క్రేజ్ వీటన్నంటిని బేరీజు వేసుకుని నెంబర్ వన్ ఎవరా? అని కొందరు ర్యాంక్‌లు ఇస్తుంటారు. అయితే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన గత రెండు మూడు దశాబ్దాలుగా అలాంటి సమస్యే రాలేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఏకఛత్రాదిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే యంగ్ స్టర్స్‌తో సమానంగా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాడు. అయితే ఇటీవలె ఓ సంస్థ చేసిన సర్వే, విడుదల చేసిన ఫలితాలు ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్ క్రియేట్ చేసింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.
టాప్‌లో మహేష్ బాబు..
ఒర్మాక్స్ అనే మీడియా సంస్థ టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ స్టార్ హీరోలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఒర్మాక్స్ విడుదల చేసిన టాప్ 10 హీరోల లిస్ట్.. 1. మహేష్ బాబు, 2. అల్లు అర్జున్, 3. ప్రభాస్, 4. పవన్ కల్యాణ్, 5. ఎన్టీఆర్, 6. చిరంజీవి, 7. రామ్ చరణ్, 8. నాని, 9. విజయ్ దేవరకొండ, 10. వెంకటేష్

కలెక్షన్ల ఆధారంగా..
మార్చి 2020 వరకు వారి సినిమాలు, సాధించిన కలెక్షన్స్ ఆధారంగా ఈ ప్లేస్‌లు నిర్ణయించింది. అయితే వీటిలో వారి వారి హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్‌కు చాలా అనుమానాలే వస్తున్నాయి. అసలు సినిమాలే లేని పవన్ కళ్యాణ్‌కు నాలుగో స్థానం ఏంటి? ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్‌కు మూడో ప్లేస్ ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ హవా..
సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన పీఆర్ టీమ్ కూడా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీంతో మహేష్ బాబుకు ఫస్ట్ ప్లేస్ రావడంతో ఆయన ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అయితే బన్నీ రెండో ప్లేస్‌లో ఉండటం, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లు వెనకాల ఉండటంతో రచ్చ మొదలైంది.
Recommended Video
ఆర్మీ పవర్ అంటే అది..
అల్లు అర్జున్ వేదిక ఎక్కితే చాలు ఆర్మీ ప్రస్థావన తీసుకొస్తాడు. అల్లు అర్జున్ ఆర్మీ అంటూ నొక్కి మరీ చెబుతాడు. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్స్ కూడా ప్రస్థావిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోయినా బన్నీకి రెండో ప్లేస్ వచ్చింది.. అదే ఆర్మీ పవర్ అని కామెంట్ చేశాడు. గత రెండేళ్లుగా ఎన్టీఆర్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోయినా ఐదో ప్లేస్ దక్కడంతో.. యంగ్ టైగర్ అంటే అది అంటూ ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ర్యాంకులు ఇవ్వడం ఏమోగానీ నెటిజన్లకు, ఫ్యాన్స్‌కు బాగానే పనిచెప్పింది.


Click it and Unblock the Notifications











