twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుమ్మురేపిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్.. లాక్‌డౌన్‌లో ఓటీటీ ఆదాయం ఎంతో తెలుసా?

    |

    కరోనావైరస్ లాక్‌డౌన్‌ కాలంలో సినీ పరిశ్రమ అతలాకుతలమైపోయింది. సినిమా నిర్మాణాలు, విడుదల ఆగిపోవడంతో ఇండస్ట్రీ దిక్కు తోచని పరిస్థితుల్లోకి వెళ్లింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సినిమా పరిశ్రమకు, ప్రేక్షకులకు ఓటీటీ ఎడారిలో ఓయాసిస్సులా కనిపిస్తున్నది. పూర్తయిన చిత్రాలను ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై విడుదలకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే తాజా రిపోర్టుల ప్రకారం ఓటీటీ పరిశ్రమ ఊహించని విధంగా వృద్ది చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకు ఓటీటీ అంటే ఏమిటీ? దాని ఆదాయం, వృద్ధి ఏ రేంజ్‌కు చేరిందనే విషయాన్ని ఓసారి పరిశీలిద్దాం..

    ఓటీటీ అంటే ఏమిటి?

    ఓటీటీ అంటే ఏమిటి?

    ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వినోదరంగంలోనూ, ప్రేక్షకుల నోట ఓటీటీ అనే ఏకైక పదం వినిపిస్తున్నది. ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. ఇంటర్నెట్ సేవల ఆధారంగా వీడియోలు, వెబ్ సిరీస్, లేదా సినిమాలను ప్రసారం చేసే మాధ్యమ సాధనం. స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్, ట్యాబ్స్ లాంటి ఎలక్ట్రానికి పరికరాల ద్వారా యాప్ ఆధారిత సేవలను వినియోగించుకోవచ్చు.

    ఓటీటీలో ప్రధానమైన యాప్స్

    ఓటీటీలో ప్రధానమైన యాప్స్

    ఓటీటీలో సేవలందిస్తున్న ప్రేక్షకాదరణ పొందిన యాప్స్‌లో అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, జీ5, ఎరోస్ నౌ, సోని లివ్, వ్యూ, అమెజాన్ ప్రైమ్ వీడియో, బిగ్‌ఫ్లిక్స్, ఏఎల్టీటీ, వూట్ యాప్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్ వీడియోకు అత్యంత ప్రేక్షకాదరణ ఉంది. అమెజాన్‌లో ఆరు భారతీయ భాషల్లో 2 వేలకుపైగా సినిమాలు ఉన్నాయి.

    ఓటీటీ వృద్ది, యూజర్లు సంఖ్య..

    ఓటీటీ వృద్ది, యూజర్లు సంఖ్య..

    తాజా గణాంకాల ప్రకారం. 2020 తొలిభాగంలో నెట్‌ఫ్లిక్స్ గణనీయమైన వృద్దిని సాధించింది. దాదాపు 26 మిలియన్ల సబ్‌స్రైబర్స్‌ను సొంతం చేసుకొన్నది. 2019లో 28 మిలియన్ల సబ్‌స్రైబర్స్ ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు 792 మిలియన్ల సబ్‌స్రైబర్స్ ఉన్నట్టు లెక్క కట్టారు. నెట్‌ఫిక్స్‌లో ఎక్ట్రాక్షన్‌ను 99 మిలియన్ల మంది, మనీ హీస్ట్ 4ను 65 మిలియన్ల మంది, ది రాంగ్ మిస్సీ 59 మిలియన్ల మంది, టూ హాట్ టు హ్యాండిల్ 51 మిలియన్ల మంది, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ 40 మిలియన్ల మంది, ఫ్లోర్ ఈజ్ లావా 37 మిలియన్స్, డీఏ 5 బ్లడ్స్ 27 మిలియన్స్ మంది చూసినట్టు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

    ఓటీటీ ఆదాయం ఎంతంటే..

    ఓటీటీ ఆదాయం ఎంతంటే..

    2018 సంవత్సరం నుంచి ఓటీటీ పరిశ్రమ అనూహ్యమైన పురోగతిని సాధించింది. 2018లో భారత్‌లో ఓటీటీ మార్కెట్ విలువ రూ.2150 కోట్లు (21.5 బిలియన్లు(గా అంచనా వేశారు. 2019 నాటికి 35 బిలియన్లు అంటే సుమారు 3500 కోట్లు ఉండవచ్చనే అంచనాకు వచ్చారు. తాజా సర్వే ప్రకారం.. భారత్‌లో సగటున ప్రతీ వ్యక్తి సుమారు 50 నిమిషాలు ఓటీటీ సేవలు పొందుతున్నట్టు సమాచారం. స్టార్ ఇండియాకు చెందిన డిస్నీ+హాట్‌స్టార్‌కు 300 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారని, దాదాపు 350 మిలియన్ల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొన్నట్టు సంస్థ తెలిపింది.

    Recommended Video

    Director Ashwin Saravanan On Game Over Movie Success || Filmibeat Telugu
     2020లో ఓటీటీ మార్కెట్ విలువ

    2020లో ఓటీటీ మార్కెట్ విలువ

    ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ మార్కెట్ విలువ 155.6 బిలియన్లు అంటే సుమారు రూ 15550 కోట్లకు చేరుకొన్నట్టు తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. 2026 నాటికి సుమారు 20 శాతం వృద్ధిని సాధించిన 438.5 బిలియన్ల రూపాయలకు చేరుకొంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో అంచనాలను మంచి ఓటీటీ వృద్దిని సాధిస్తుందనే విషయాన్ని నిపుణులు పేర్కొంటున్నారు.

    English summary
    In the lockdown period OTT Industry spike rate is very high. over–the–top media services (OTT) in India, which distribute streaming media over the Internet. In fiscal year 2018, the OTT market in India was worth ₹2,150 crore (₹21.5 billion, US$303 million as of 2018), and its value grew to ₹35 billion in 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X