twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2018లో ఈ చిత్రాలకే కాసులు పంట.. 5 వేల కోట్లు ఖర్చు.. బాక్సాఫీస్‌పై కనక వర్షం!

    |

    బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు 2018 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించింది. స్టార్ హీరోలో సినిమాలు బొక్కా బోర్లా పడగా, చిన్న సినిమాలు అని చిన్నచూపు చూస్తే అవి బంపర్‌గా వసూళ్లను సాధించాయి. పద్మావతి, బాదాయి హో లాంటి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. హిందీ చిత్ర పరిశ్రమలో 120కి పైగా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దాదాపు రూ.5 వేలకుపైగా నిర్మాణం కోసం, ప్రమోషన్ కోసం ఖర్చు చేశారు. ఈ ఏడాది భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాలు ఇవే..

     పద్మావతి చిత్రం

    పద్మావతి చిత్రం

    వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచిన పద్మావతి చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నది. రూ.190 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.585 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో నటించిన దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్, షాహీద్ కపూర్‌కు మంచి పేరు వచ్చాయి.

    నిర్మాతలకు బదాయి హో

    నిర్మాతలకు బదాయి హో

    తక్కువ బడ్జెట్‌తో అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బదాయి హో. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, నీనా గుప్తా, గజరాజ్ రావు, సన్యా మల్హోత్రా తదితరులు నటించారు. ఈ చిత్రం రూ.29 కోట్లతో రూపొందగా, ప్రపంచవ్యాప్తంగా రూ.221 కోట్లు సాధించింది.

    కలెక్షన్లలో రాజీపడని చిత్రంగా రాజీ

    కలెక్షన్లలో రాజీపడని చిత్రంగా రాజీ

    ప్రముఖ రచయిత హరిందర్ సిక్కా నవల సెహమత్ ఆధారంగా రూపొందిన చిత్రం రాజీ. ఈ చిత్రంలో అలియా భట్ హీరోయిన్‌గా, వికీ కౌశల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రూ.40 కోట్లతో రూపొందగా, వరల్డ్ వైడ్‌గా రూ.193 కోట్లు సాధించింది.

    తెరపైన సంజయ్ జీవితం సంజూ

    తెరపైన సంజయ్ జీవితం సంజూ

    ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం సంజూ. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సంజయ్ దత్‌గా రణబీర్ కపూర్ నటించాడు. ఈ చిత్రం రూ.578 కోట్లు సంపాదించడం ఓ రికార్డు.

    బాలీవుడ్‌లో 2.0 హంగామా

    బాలీవుడ్‌లో 2.0 హంగామా

    సెన్సేషనల్ డైరెక్టర్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం 2.0. ఈ చిత్రాన్ని భారీగా రూ.550 కోట్లతో తెరకెక్కించారు. అత్యంత సాంకేతికంగా, 3డీ టెక్నాలజీతో రూపొందించిన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు వసూలు చేసింది.

    కలెక్షన్లతో ముంచెత్తిన స్త్రీ మూవీ

    కలెక్షన్లతో ముంచెత్తిన స్త్రీ మూవీ

    బాలీవుడ్‌లో ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం స్త్రీ. శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు నటించిన ఈ చిత్రం హారర్, కామెడీగా రూపొందింది. సుమారు రూ.20 కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.130 కోట్లు వసూలు చేసింది. చిన్న చిత్రాల్లో స్త్రీ చిత్రం అగ్రస్థానంలో నిలిచింది.

    100 కోట్ల సోను కి స్వీటి

    100 కోట్ల సోను కి స్వీటి

    చిన్న చిత్రాల్లో భారీ విజయం సాధించిన చిత్రం సోను కె టిటూ కి స్వీటి. ఈ చిత్రం కూడా ఎలాంటి టాక్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తక్కువ బడ్జెట్, స్టార్ హీరోలు, హీరోయిన్లు లేని చిత్రం రూ.100 కోట్లు సంపాదించింది.

    English summary
    Ranbir Kapoor's Sanju and Ranveer Singh's Padmaavat have emerged as the highest grossing Bollywood movies of 2018 at the box office. Bollywood produced over 120 movies this year and the makers have spent Rs 5,000 crore on their production and promotion. Over 20 among these Hind films have become hit at the domestic box office, while the remaining turned out to flop films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X