twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాష్‌బ్యాక్ : దాదాపు ఓ 40 టైటిల్స్ పరిశీలించారట.. ‘గీతగోవిందం’ వెనుకున్న కథ ఇదే!!

    |

    గీతగోవిందం సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. విజయ్ దేవరకొంద-రష్మిక మందాన్నలతో పరుశురామ్ చేసిన మ్యాజిక్కే గీతగోవిందం. హ్యాస్యాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు కావాల్సినంత ఉంటుంది. స్వచ్చమైన ప్రేమను ఆస్వాధించాలనుకునే వారికి బోలెడంత కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా చూడాలనకుంటే ఎంచక్కా చూడొచ్చు. ఇన్ని కోణాలున్నాయి కాబట్టే గీతగోవిందం ఓ సెన్సేషన్. వంద కోట్ల గ్రాస్‌ను రాబట్టి చిన్న సినిమాల స్టామినాను అమాంతం పెంచేసింది. ఈ మూవీ టైటిల్ విషయంలో పెద్ద కథే జరిగిందంటా. అదేంటో ఓ సారి చూద్దాం.

    అంచనాలు లేకుండానే..

    అంచనాలు లేకుండానే..


    అయితే ఈ సినిమా రావడంపై ఎవ్వరికీ పెద్ద అంచనాలు లేవు. ఎన్నో చిన్న సినిమాలు వస్తుంటాయ్ కదా అనుకున్నారు. కాకపోతే అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రమని కొంత హైప్ క్రియేట్ అయింది. ఇక సినిమా విడుదలకు ముందు తన స్టైల్లో సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకున్నాడు విజయ్.

    ఒక్క పాటతో ఆకర్షించేశారు..

    ఒక్క పాటతో ఆకర్షించేశారు..

    గీతగోవిందం సినిమాల్లోంచి ఇంకేం ఇంకేం కావాలే అనే పాట విడుదల చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాట, బాణీ, సాహిత్యం, ఇద్దరి కెమిస్ట్రీ అన్ని కలగలపి గీతగోవిందంపై ఆసక్తిని పెంచాయి. గోపీ సుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు అతిపెద్ద బలంగా మారింది.

    కలెక్షన్ల వర్షం..

    కలెక్షన్ల వర్షం..

    గీతగోవిందం చిత్రం 2018 ఆగస్టు 15న విడుదల కాగా.. ఆ ఏడాది బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వంద కోట్ల క్లబ్‌లో చేరిన అతికొద్ది సినిమా జాబితాల్లో గీతగోవిందం చోటు సంపాదించుకుంది. అంతటి బ్లాక్ బస్టర్ కావడానికి ఆ టైటిల్ కూడా ఓ కారణమే.

    టైటిల్‌పై చర్చ..

    టైటిల్‌పై చర్చ..


    పరుశురామ్ తన టైటిల్స్ ఎప్పుడూ సాప్ట్‌గా ఉండేలానే చూసుకుంటాడు. అందుకే సోలో, శ్రీరస్తు శుభమస్తు, సారోచ్చారు వంటి క్లాస్ టైటిల్స్ ఎంచుకుంటారు. అయితే గీతగోవిందం విషయంలో మాత్రం దాదాపు40 టైటిల్స్ వరకు పరిశీలించారట. పరుశురామ్ మాత్రం గీతగోవిందంకే ఫిక్స్ అయ్యారట. అయితే అల్లు అరవింద్ మాత్రం ఒప్పుకోలేదట. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ ఈ సినిమా చేస్తున్నాడు.. మరి ఇంత సాఫ్ట్ టైటిల్ కాంట్రాస్ట్‌గా ఉంటుంది వద్దన్నాడట.

    దాని వెనుకున్న సీక్రెట్ అదే..

    దాని వెనుకున్న సీక్రెట్ అదే..


    అయితే పరుశురామ్ మాత్రం ఒప్పుకోలేదట.. మళ్లీ వెళ్లి సర్ది చెప్పారట. మనం ఏదైనా నెగెటివ్ అనుకుంటున్నామో అదే పాజిటివ్ అవుతుందని, కనీసం టైటిల్ కోసమైనా వస్తారని అనడంతో ఒప్పుకున్నారుట. మహాభారతంలో రాధ, కృష్ణుడు మాట్లాడుకుంటారు.. అదే గీత గోవిందం.. కానీ ఇక్కడ రాధ స్థానంలో విజయ్.. కృష్ణుడు స్థానంలో రష్మిక ఉంటుందని పరుశురామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

    English summary
    Parasuram About Story Behind Geetha Govindam Title. Initially Geetha Govindam title was rejected by allu aravind.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X