రూ. 100 కోట్లు వచ్చాయి... నేను స్టార్ డైరెక్టరా? కాదా? మీరే తేల్చాలి!

By Bojja Kumar

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 బేనర్ తెరకెక్కించిన 'గీత గోవిందం' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. 12 రోజుల్లో రూ. 102 కోట్ల గ్రాస్, రూ. 52.11 కోట్ల షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురాం మీడియాతో ముచ్చటించారు. పదేల్ల క్రితం నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజైంది. ఈ పదేళ్లలో 6 సినిమాలుకు దర్శకత్వం వహించాను. అందులో కొన్ని బాగా ఆడాయి, కొన్ని బాగా ఆడనివి కూడా ఉన్నాయి. 'గీత గోవిందం' ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, రైటర్‌గా పునర్జన్మనిచ్చింది అని పరశురాం అన్నారు.

Recommended Video

Vijay Devarakonda's Geetha Govindam Movie World Wide Collections
స్టార్ డైరెక్టర్ అనడానికి కొలమానం ఉండదు

స్టార్ డైరెక్టర్ అనడానికి కొలమానం ఉండదు

ఆదివారంతో మా సినిమా రూ. 102 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నేను స్టార్‌ డైరెక్టర్ల లిస్టులో చేరాను అని క్రిష్‌గారు అభిమానంతో అన్నారు. స్టార్ లీగ్‌లో చేరాడు అనడానికి కొలమానం అంటూ ఏమీ ఉండదు. వంద కోట్లు వస్తేనే స్టార్ డైరెక్టర్... లేకపోతే కాదా? అనేది మీరే(మీడియా) చెప్పాలి అంటూ ఓ ప్రశ్నకు పరశురాం సమాధానం ఇచ్చారు.

సినిమా విజయానికి కారణం

సినిమా విజయానికి కారణం

మా కష్టానికి ప్రేక్షకులు మేము అనుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చారు. ఈ సినిమా ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా. కథ అలా కుదిరింది. విజయ్ కూడా ప్రాజెక్టుకు ప్లస్ అయ్యాడు. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇలా అన్నీ సినిమాకు బాగా కలిసొచ్చాయి. దీంతో పాటు గీతా ఆర్ట్స్ సపోర్ట్... కాస్టింగ్ బాగా కుదరడం వల్లే సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందని పరశురాం అన్నారు.

సినిమా లీక్ వ్యవహారంపై

సినిమా లీక్ వ్యవహారంపై

ఏ సినిమాకైనా కష్టపడతాం. ఇది నా బేబీ లాంటిది. సినిమా విడుదల ముందు కొన్ని లీక్ అవ్వడంతో చాలా టెన్షన్ పడ్డాం. కోప్పడాలా? భయపడాలా? ఏడవాలా? అర్థం కాలేదు. అయితే అరవింద్ గారు, గీతా ఆర్ట్స్ ఉన్నారనే ధైర్యం అయితే ఉంది. ఆ రోజు అరవింద్ గారు ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడుకు అంతా సెట్ అవుద్ది అన్నారు... అని పరశురాం గుర్తు చేసుకున్నారు.

బన్నీకి చాలా నచ్చి కథ ఇది

బన్నీకి చాలా నచ్చి కథ ఇది

ఈ కథ బన్నీకి చాలా ఇష్టం. ఫస్ట్ నుండి ఎంకరేజ్ చేసింది ఆయనే. ఎప్పుడు కనిపించినా దీని గురించి అడిగి తెలుసుకునే వారు. సినిమా హిట్టయిన వెంటనే మా అందరినీ పిలిచి పార్టీ కూడా ఇచ్చారు. ఆయనతో అతి త్వరలోనే సినిమా చేస్తాను అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X