కులం కోసం కాదు... పంతం నెగ్గించుకోవడానికి జరిగిన హత్య: పరుచూరి గోపాలకృష్ణ

ఈ మధ్య రెండు మూడు సంఘటనలు చూసినపుడు మనస్తాపానికి గురయ్యాను. అభ్యుదయాన్ని ప్రేమించే మనిషిగా, ఒక ఆచార్యుడిగా, రచయితగా సమాజంలో జరుగుతున్న వాటిపై స్పందించాలనిపించింది. మొన్న ప్రణయ్-అమృత ఉదంతం, ఆ తర్వాత మాధవి చూస్తుంటే బాధేసింది... అంటూ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తన మనసులోని విషయాలను బయట పెట్టారు.

మనం పెంచిన చెట్టును నరికే హక్కే మనకు ఉండదు. కానీ, పెంచిన బిడ్డను అలా చేయాలన్న ఆలోచన చేయడం చాలా బాధ అనిపించింది. హత్యలు కానీ, ఆత్మహత్యలు గానీ క్షణికావేశంలో జరుగుతాయంటారు. కానీ, ఇవి క్షణికావేశంలో జరగలేదు. కోపం పెరిగి పెరిగి పెద్దదై ఒక పంతంలా మారిపోయి హత్యకు దారితీసినట్లు అనిపించింది అని పరుచూరి చెప్పుకొచ్చారు.

Paruchuri Gopala Krishna Emotional Words About Honour Assassinations in Society

దీన్ని అందరూ 'పరువు హత్య' అంటున్నారు...కానీ దీన్ని నేను 'పంతం హత్య' అనుకుంటున్నాను. ఇది కులం కోసం కాకుండా, పంతం కోసం జరుగిన హత్య అనిపిస్తోంది అని పరుచూరి అభిప్రాయ పడ్డారు.

నాగరికతకు అనుగుణంగా మనుషులు కూడా మారాలి అని చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ... హత్యలు, రేప్‌లు చేసిన వాళ్లను పదేపదే చూపిస్తుంటే.. సమాజంలో కొంత మంది తెలియని ప్రభావానికి లోనై, అలాంటి నేరాలు చేసే ప్రమాదం ఉందని తనకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మీడియాలో చూపడం, డిబేట్స్ పెట్టడం ఆపాలని మీడియాకు సూచించారు. ప్రాణంపోతే తిరిగి రాదని, పిల్లల విషయంలో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X