For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఎన్టీఆర్‌ని చూసి భయమేసింది.. రాఘవేంద్ర రావు, మోహన్ బాబు ఫోర్స్ చేశారు'

  |
  Paruchuri Gopala Krishna About NTR's Major Chandrakanth Movie || Paruchuri Paataalu || Filmibeat

  విశ్వవిఖ్యాత నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి పలుకులు అనే యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా సినిమా సంగతులు, విశ్లేషణలు ప్రేక్షకులతో పంచుకుంటున్న ఆయన.. తన తాజా వీడియో ద్వారా ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచిన మేజర్ చంద్రకాంత్ సినిమా విశేషాలు, ఆ సినిమా సమయంలో ఎన్టీఆర్ ఆరోగ్యం లాంటి విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన ఆ వివారాలు చూస్తే..

   ఎన్టీఆర్ ఆరోగ్యం కాస్త కుదుటగా లేకపోవడంతో చంద్రబాబు

  ఎన్టీఆర్ ఆరోగ్యం కాస్త కుదుటగా లేకపోవడంతో చంద్రబాబు

  ఓ రోజు అన్నగారు నన్ను పిలిచి ఒక కథ రాయండి బ్రదర్.. సినిమా చేద్దాం అన్నారు. సరే అని చెప్పాము. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ ఆరోగ్యం కాస్త కుదుటగా లేకపోవడంతో చంద్రబాబు వచ్చి తొందరపడకండి.. ఆయన ఎమోషనల్‌గా నటించాడంటే మళ్ళీ ఆరోగ్యం చెడిపోతుంది అన్నారు. దీంతో అన్నగారి ఆరోగ్యం గురించి ఆలోచించి మేము కథ రాయలేదు అని పరుచూరి చెప్పారు.

   భయమేసింది ఆయనకు కనిపించకుండా తప్పించుకొని

  భయమేసింది ఆయనకు కనిపించకుండా తప్పించుకొని

  అయితే ఓ రోజు దగ్గరి వారింట్లో ఫంక్షన్ కి వెళ్ళాం. అక్కడ ఆయన కనిపించడంతో కథ ఆడుతాడేమోనని భయమేసి తప్పించుకొని వెళ్లబోయా.. కానీ ఆయన వెనక నుంచి వచ్చి వీపుపై ఒక్కటి చరిచారు. ''దొంగా.. కథ చెప్పాల్సి వస్తుందని పారిపోతున్నావా'' అన్నారు. దీంతో ఏం చేయాలో తోచక కథ రెడీగా ఉందని చెప్పేశా. వెంటనే ఆయన తీసుకురా అన్నాడు. ఈ విషయంలో అన్నయ పరుచూరి వెంకటేశ్వరరావుకు చెప్పడంతో ఓ రోజు రాత్రంతా కూర్చొని మేజర్ చంద్రకాంత్ కథ రాశారు అని చెప్పాడు గోపాలకృష్ణ.

  రాఘవేంద్ర రావు, మోహన్ బాబు ఒత్తిడి

  ఆ కథను ఎన్టీఆర్ వద్దకు తీసుకుపోయి కథ చెబుతుంటే.. ఏడో నిమిషంలోనే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనేశారు. మాసాబ్ ట్యాంక్ వద్ద షూటింగ్ మొదలైంది. ఆ టైమ్ లో మంత్రి పాత్ర వేసే నటుడు షూటింగ్ స్పాట్ కి రాకపోవడంతో రాఘవేంద్ర రావు, మోహన్ బాబు ఒత్తిడి చేసి నాతో మంత్రి పాత్ర చేయించారు. షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశంలో నాపై కోప్పడుతూ డైలాగ్‌ చెప్పాలి. అందుకు అన్నగారు ఒప్పుకోలేదు. అలా డైలాగ్‌ చెప్పాలంటే నన్ను తీసేసి వేరే నటుడిని పెట్టమని చెప్పారు. ఆ మాట విని అక్కడున్న వారంతా ఆశ్చర్య పోయారు.. అని గోపాలకృష్ణ పేర్కొన్నారు.

  నేనసలు ఆ పెళ్ళికి వెళ్లకపోయుంటే..

  నేనసలు ఆ పెళ్ళికి వెళ్లకపోయుంటే..

  అలా అలా మేజర్ చంద్రాకాత్ షూటింగ్ కంప్లీట్ చేశాం. చివరగా ఎన్టీఆర్ చేసిన డబ్బింగ్ మాత్రం సరిగా రాలేదు. ఈ విషయమా ఆయనతో నేరుగా చెప్పా. వెంటనే మళ్లీ చేద్దాం అన్నారు. ఆ సమయంలో ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చిన మరుసటి రోజు డబ్బింగ్‌ చెప్పారు. అందుకే గొంతు కాస్త బొంగురు పోయినట్లు అనిపించింది. నేనసలు ఆ పెళ్ళికి వెళ్లకపోయుంటే..ఈ మేజర్ చంద్రకాంత్ కథ పుట్టేదో!లేదో ! అని చెప్పారు పరుచూరి.

  కొత్త దర్శకులకు సలహా

  కొత్త దర్శకులకు సలహా

  మేజర్ చంద్రకాంత్ అనుభవాలు చెబుతూ చివరగా కొత్త దర్శకులకు ఓ విలువైన సలహా ఇచ్చారు ప్రచురి గోపాలకృష్ణ. సినిమా బాగారావాలి అంటే సారైనా కారణం చెప్పి ఎంత పెద్ద నటుడినైనా ఒప్పించుకోవచ్చు. పెద్ద హీరోలని ఎప్పుడూ భయపడొద్దు. మంచి చెబితే వారు వినడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు అని చెప్పి ముగించారు పరుచూరి.

  English summary
  In the lastest video of Paruchuri Palukulu programe Paruchuri Gopala Krishna says about N. T. Rama Rao and Major Chandrakanth cinema memories.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X