twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రమోహన్ ఓ పీనాసి.. ఫోన్ చేస్తే పెట్టేయ్ రా అన్నాడు.. పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్‌ది ఓ స్వర్ణయుగం. పరుచూరి వెంకటేశ్వర రావు, పరుచూరి గోపాలకృష్ణల కలం నుంచి ఎన్నో మరుపురాని కథలు, ఇండస్ట్రీ రికార్డులు పుట్టుకొచ్చాయి. నటనలోనూ వారిద్దరికీ ఓ ప్రత్యేక స్థానం. ఇప్పటికే 350 చిత్రాలను చేసినా అలుపెరగని ప్రయాణం వారిది. ఇప్పటికీ ఏదో ఒక విధంగా కళాభిమానులకు సేవ చేస్తూనే ఉన్నారు. పరుచూరి పలుకులు పేరిట యూట్యూబ్‌లో పరుచూరి గోపాలకృష్ణ చెప్పే మంచి విషయాలను కొన్ని లక్షల మంది వింటుంటారు. తాజాగా ఆ పాఠాల్లో భాగంగా చంద్ర మోహన్ గురించి చెప్పుకొచ్చారు.

    పక్క ఊరు..

    పక్క ఊరు..

    చంద్రమోహన్ గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారని, అందుకే ఈ వీడియో చేస్తున్నానని పరుచూరి చెప్పుకొచ్చారు. ‘చంద్రమోహన్‌ది మాది పక్క పక్క ఊర్లే. మాది మేడూరు..పక్కనే ఐదు ఫర్లాంగుల దూరం ఉండే పమిడిముక్కల గ్రామం చంద్రమోహన్‌ది. మా సంబంధం పక్క పక్క ఊర్లు అనే కాదు. చంద్రమోహన్ మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావు క్లాస్ మేట్. ఆయన బెంచ్ మేట్ కూడా. మా అక్క కూడా అక్కడే చదివారు. నాతో పెద్దగా పరిచయం లేదు కాని.. మా ఇంటికి వచ్చేవారు చంద్రమోహన్'అని నాటి విశేషాలను చెప్పుకొచ్చారు.

    పొట్టివాడైనా గట్టివాడు..

    పొట్టివాడైనా గట్టివాడు..

    మాకంటే ముందుగానే చంద్రమోహన్ సినిమాల్లోకి వచ్చారు. చంద్రమోహన్ నటించిన రంగుల రాట్నం సినిమా చాలా సార్లు చూశాం. మా ఊరు వాడు అని సంబర పడ్డాం. చంద్రమోహన్ పొట్టి వాడే కానీ గట్టివాడు.. చంద్రమోహన్ నిజంగానే నాలుగు అంగుళాల ఎత్తు ఉండి ఉంటే.. శోభన్ బాబు అయ్యేవాడో.. లేక ఎన్టీఆర్ అయ్యే వాడో తెలియదు.

    భోజన ప్రియుడు..

    భోజన ప్రియుడు..

    చంద్రమోహన్ మంచి భోజన ప్రియుడు.. అస్సలు మొహమాట పడడు. తన ముందు ఎంత మంది ఉన్నా.. పట్టించుకోకుండా తన కడుపుకి ఏది కావాలనిపిస్తే అది తింటాడు. ఎవరు చూస్తున్నాం ఏం అనుకున్నా పట్టించుకోడు. అది చాలా మంచి లక్షణం.

    ఓ పీనాసి..

    ఓ పీనాసి..

    ఇండస్ట్రీలో చాలామంది చంద్రమోహన్‌ని పీనాసీ అంటారు. దాన్ని నేను అంగీకరించను. జాగ్రత్త పరుడు అతను. మనకి ఒక రూపాయి వస్తే.. ఆ రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి.. అందులో ఎంత దాచుకోవాలో బాగా తెలిసిన వాడు చంద్రమోహన్. తెలుగు పరిశ్రమలో శోభన్ బాబు.. మోహన్ బాబు.. శ్రీధర్.. చంద్రమోహన్ ఈ నలుగుర్నీ ఆదర్శంగా తీసుకుంటే మీ ఆస్తులు మీదగ్గరే ఉంటాయి. వాళ్లు నిజంగా గొప్పవాళ్లే. ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఉంచారు. దాన్ని పీనాసితనం అనరు.. జాగ్రత్త పడటం అని అంటారు.

    Recommended Video

    Gollapudi Maruthi Rao Biography || Filmibeat Telugu
    ఫోన్ చేస్తే పెట్టేయ్ రా..

    ఫోన్ చేస్తే పెట్టేయ్ రా..

    ఆ మధ్య నా మనవడి పెళ్లి గురించి చెప్పేందుకు ఫోన్ చేశాను. నేను హలో అనేసరికి ఫోన్ పెట్టేయ్ రా.. అని అరుస్తున్నాడు. నేను గోపాల కృష్ణను అని చెప్పాక.. ఓ మీరా సారీ అని అన్నాడు.. ఎవ్వరో ఊరికే ఫోన్ చేసి విసిగిస్తున్నారు.. ట్రూ కాలర్ ద్వారా నంబర్ తెలుసుకుని మా అందరినీ తెగ విసిగేంచిస్తున్నారు.. అలా చంద్రమోహన్ ఐదు ఫర్లాంగుల దూరంలో ఉన్నాడే గానీ మా మనసుకు దగ్గరగానే ఉన్న మంచి నటుడు' అని చంద్రమోహన్ గురించి వివరించారు.

    English summary
    Paruchuri Gopalakrishna About Chandra Mohan. Paruchuri Gopalakrishna Says Greatness Of Chandra Mohan In His Paruchuri Palukulu Programme.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X