twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా అన్నయ్య గారి వల్లే నాన్న కూడా మారిపోయాడు.. చిరు ట్వీట్‌పై పవన్ కళ్యాణ్

    |

    మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ భక్తుడని అందరికీ తెలిసిందే. ఆంజనేయుడికి చిరంజీవి ఏదో తెలియని సంబంధం ఉంది. ఎవరో తన కలలోకి వచ్చి చిరంజీవి అని పిలిచినట్టు అనిపించిందని, ఆ తరువాతే శివ శంకర వర ప్రసాద్ కాస్తా చిరంజీవిగా మారాడాని స్వయంగా చిరునే చెప్పుకొచ్చాడు. ఇష్టదైవ మైన ఆంజనేయుడిని కొలుస్తారు కాబట్టే.. వారి నిర్మాణ సంస్థలోనూ ఆ దైవాన్నే ప్రతిష్టాంచారు. తనకు హనుమంతుడికి ఉన్న సంబంధాన్ని నిన్న (హనుమాన్ జయంతి ఏప్రిల్ 8) చిరు బయట పెట్టిన సంగతి తెలిసిందే.

    హనుమాన్ జయంతి సందర్భంగా..

    హనుమాన్ జయంతి సందర్భంగా..

    హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...చిన్నప్పటి నుంచి...1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్.

    నాన్న గారు అలా అన్నారు..

    నాన్న గారు అలా అన్నారు..

    కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, ‘ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి'' అన్నారు. అప్పటి తన చిన్న నాటి ఫోటోను కూడా చిరు షేర్ చేశాడు.

    బాపు గీసిన బొమ్మ..

    ‘కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా.. "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే'నంటూ నాటి సంగతులను అభిమానులతో పంచుకున్నాడు.

    Recommended Video

    Puri Jagannath Upcoming Movie With That Star Hero
    మా నాన్న కూడా మారిపోయాడు..

    మా నాన్న కూడా మారిపోయాడు..

    చిరు చేసిన ఈ ట్వీట్స్‌పై పవన్ కళ్యాణ్ స్పందించాడు. మా ఇంట్లో హనుమాన్‌ను కొలవడం మా అన్నయ్య చిరంజీవి గారితోనే ప్రారంభమైంది.. మా అన్నయ్య వల్లే దేవుడిని నమ్మని ఓ కమ్యూనిస్ట్ వంటి మా నాన్న గారు రామ భక్తుడిలా మారిపోయాడు.. నా టీన్ ఏజ్‌లోనే నేను కూడా హనుమాన్ చాలీసా చదివేవాడిని.. జై హన్‌మాన్' అంటూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.

    English summary
    Pawan Kalyan About chiranjeevi Hanuman Jayanti. Hanumanji worship came into our home through my brother-Chiranjeevi garu; & that made my father to transform from an atheist& communist to Lord Rama Devotee. I used to recite Chalisa 108 times in certain days of my teen age.Jai Hanuman!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X