పవన్ కళ్యాణ్ పేరుతో ఫ్యాన్స్ బిగెస్ట్ రికార్డ్.. ఇది ఆరంభం మాత్రమే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సౌత్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. రాజకీయాలతో బిజీగా ఉండడం వలన బాక్సాఫీస్ రికార్డులు చాలా వరకు తగ్గాయి గాని ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేసి ఉంటే గనక వాటి లెక్కలు మరోలా ఉండేవి అందుకే సాక్ష్యం ఇంటర్నెట్ ప్రపంచంలో ఆయన క్రేజ్ పెరగడమే. 24గంటల్లో ఫ్యాన్స్ స్పీడ్ కి పాత రికార్డులన్ని ఎగిరిపోయాయి.

 ఆర్మీకి ఆర్థిక సహాయం..

ఆర్మీకి ఆర్థిక సహాయం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని సౌత్ ప్రేక్షకులు ఉండరు. ఖుషి సినిమా నుంచి నార్త్ ఆడియెన్స్ కి కూడా పవన్ చాలా దగ్గరయ్యాడు. దీంతో పవన్ కి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. పలు సామాజిక అంశాలపై పవన్ స్పంధించే విధానం కొన్నిసార్లు దేశ వ్యాప్తంగా జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతంలో ఆర్మీ వెల్ఫేర్ కోసం కోటి రూపాయల విరాలన్ని ప్రకటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

 సరికొత్త రికార్డ్..

సరికొత్త రికార్డ్..

అసలు మ్యాటర్ లోకి వస్తే.. పవన్ కళ్యాణ్ అడ్వాన్ హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆయాన బర్త్ డేకి ఇంకా చాలా సమయం ఉంది. సెప్టెంబర్ 2న బర్త్ డే అయినప్పటికీ ముందుగానే అభిమానులు అడ్వాన్స్ హ్యాపీ బిర్త్ డే పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ ని ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు.

24గంటల్లోనే..

24గంటల్లోనే..

కేవలం 24 గంటల్లోనే #AdvanceHBDPavanKalyan ట్యాగ్ తో 27.3 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి. దేశంలో బిగ్గెస్ట్ ట్విట్టర్ ట్రెండ్ గా పవన్ కళ్యాణ్ పేరు మారు మ్రోగింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ రోజురోజుకి ఏ స్థాయిలో పెరిగిపోతుందో ఈ హ్యాష్ ట్యాగ్స్ తో క్లారిటీ వచ్చేసింది. బర్త్ డేకి ఇంకా నెలరోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే అంతలా రికార్డ్ చేశారు అంటే ఇక అసలైన పుట్టినరోజుకి ఇంకా ఏ స్థాయిలో రికార్డులు నమోదవుతాయో చూడాలి.

Recommended Video

Shruti Haasan Demands Huge Remuneration For Pawan Kalyan's Movie
ఇది ఆరంభం మాత్రమే..

ఇది ఆరంభం మాత్రమే..

కేవలం ఈ రికార్డ్ ఆరంభం మాత్రమే అనేలా ఫ్యాన్స్ డోస్ పెంచుతున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గింది అన్నవారికి కూడా ఈ రికార్డ్ తో అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ గనక లేకపోయి ఉంటే పవర్ స్టార్ అభిమానుల జోరు మరోలా ఉండేదని చెప్పవచ్చు. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన వకీల్ సాబ్ వాయిదా పడటం వల్ల ఫ్యాన్స్ కొంత నిరాశకు లోనయ్యారు. ఇక సెప్టెంబర్ 2న పరిస్థితులు అనుకూలిస్తే బిర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ జనసైనికులకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X