పెంచల్ దాస్‌ను సత్కరించిన పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి కూడా ముచ్చటపడి..

ప్రస్తుతం టాలీవుడ్‌లో పెంచల్ దాస్ పేరు మార్మోగిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ముచ్చటపడి మరీ పాడించుకున్నాడు. నిన్నటి శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పెంచల్ దాసి పాడిన భలేగా ఉంది బాల పాట అందరినీ ఆకట్టుకుంది. ఇక చివర్లో చిరంజీవి అడిగి మరీ పాడించుకున్నాడు. పెంచల్ దాస్ గ్రాతం, ఆయన రచన ఇండస్ట్రీలో అందరినీ ఆకట్టుకుంటోంది. అరవింద సమేతలో ఆయన పాడిన రాసిన పాట ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.

అంతకు ముందు కృష్ణార్జున యుద్దం సినిమా కోసం రాసిన దారి చూడు అనే పాట సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు శ్రీకారం పాటతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు. ఈ క్రమంలో పెంచల్ దాస్‌తో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ముచ్చటించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కలిసి పెంచల్ దాస్‌ను సత్కరించారు. అయ్యప్పనుమ్ కోషియుమ్ సెట్‌లో ఈ భేటీ జరిగినట్టు కనిపిస్తోంది.

Pawan kalyan and Trivikram Felicitates Penchal das

రాయలసీమ జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్ గారిని పవన్ కళ్యాణ్ సత్కారించారు. పెంచల్ దాస్ గారు రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్నీ నేటి తరానికి చేరువ చేస్తున్న విధానం అభినందనీయం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. గీత రచయిత, గాయకుడు శ్రీ పెంచల్ దాస్ గారు మంగళవారం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ని కలిశారు. ఈ సందర్భంగా తెలుగు జానపదాలు, సీమ మాండలికంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ గారు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X