అనంత్ అంబానీ రిసెప్షన్ కోసం పవన్ కల్యాణ్.. ముఖేష్ అంబానీ ప్రత్యేక ఆహ్వానం మేరకు ముంబైలో!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జూలై 12వ తేదీన జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు రాధిక మర్చంట్‌తో జరిగిన ఈ వివాహానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, రాజ్యాధినేతలు, సినీ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు హాజరయ్యారు. జూలై 13వ తేదీన జరిగే రిసెప్షన్‌లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబై చేరుకొన్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం తెలిసిందే. అనంతరం డిప్యూటీ సీఎం, ఇతర మంత్రిత్వ శాఖల బాధ్యతలను చేపట్టిన ఆయన బిజీబిజీగా అదికారులతో చర్చలు జరుపుతున్నారు. సమావేశాల్లో బిజీగా ఉంటూనే ప్రజా సంక్షేమం కోసం సంచలనం నిర్ణయాలు తీసుకొంటున్నారు.

ఇక ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ వారాహి దీక్షలో ఉన్నారు. దీక్షను కొనసాగిస్తూనే వ్యక్తిగత, ప్రొఫెషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా తన బిజీ షెడ్యూల్ నుంచి కొంత విరామం తీసుకొని అంబానీ కుటుంబం ఆహ్వానం మేరకు ఆయన కుమారుడి రిసెప్షన్ వేడుకలో పాల్గొనేందుకు శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి ముంబై చేరుకొన్నారు.
ముంబై విమానాశ్రయంలో పవన్ కల్యాణ్‌కు భారీ ఆహ్వానం పలికారు. ఆయన కోసం మీడియా ఆసక్తిగా ఎదురు చూసింది. పవన్ కల్యాణ్ అంటూ మీడియా పిలుపులకు ఆయన చిరునవ్వుతో చూసి పెళ్లి విందులో పాల్గొనడానికి వెళ్లారు. ప్రస్తుతం ఆ వీడియో మీడియాలో వైరల్ అయింది.
ఇదిలా ఉండగా, ఇప్పటికే ఆ విందులో పాల్గొనడానికి రానా దగ్గుబాటి, ధోని, ఇతర సినీ ప్రముఖులు విందు ప్రదేశానికి చేరుకొన్నారు. అత్యంత విలాసవంతంగా, ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా ఈ వివాహాన్ని నిర్వహిస్తూ అంబానీ కుటుంబం చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications











