Pawan Kalyan వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి పవన్ కల్యాణ్.. జై జనసేన అంటూ పవర్ స్టార్ ఫ్యాన్ నినాదాలు!

స్వర్గీయ వైఎస్ఆర్ కూతురు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రైవేట్ కార్యక్రమంగా సాగిన ఈ వేడుకకు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.

అయితే ఈ వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. అయితే ఈ వేడుకలో అందర్నీ ఆకట్టుకొనే విషయం ఒకటి జరిగింది. ఆ ఆసక్తికరమైన విషయం, ఇతర హైలెట్స్‌ వివరాల్లోకి వెళితే..

Pawan-Kalayn-YS-RajaReddy-Engagement

తన కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థం కోసం షర్మిల స్వయంగా తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతీపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియా ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో జనవరి 18వ తేదీన వారి మ్యారేజ్ ఎంగేజ్‌మెంట్‌ను ఘనంగా జరిపారు.

షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతీతో కలిసి వచ్చారు. కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తన తల్లిని కౌగిలించుకొని అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. మేనల్లుడి వివాహ నిశ్చితార్థం వేడుక నుంచి వెంటనే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

ఇక వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హజరయ్యారు. ఆయనను షర్మిల, అనిల్ దంపతులు సాదారంగా ఆహ్వనించారు. వేదికపైకి వచ్చిన పవన్ కల్యాణ్ అట్లూరి ప్రియ, రాజారెడ్డిని సంప్రదాయ పద్దతిలో ఆశ్వీరదించారు. వేదికపై పవన్ కల్యాణ్‌తో అనిల్, షర్మిల కలుపుగోలుగా, ప్రేమగా పలకరించుకొన్నారు.

నిశ్చితార్థం వేదికపై షర్మిల, అనిల్‌తో మాట్లాడుతుండగా.. ఆ పక్కనే ఉన్న జనసేన అభిమానులు నినాదాలు చేశారు. జై జనసేన, జై జనసేన అంటూ నినాదాలు చేయగానే పవన్ కల్యాణ్ సిగ్గు పడుతూ నవ్వుల్లో మునిగారు. అక్కడి నుంచి వెళ్తూ అనిల్, షర్మిల దంపతులకు చేతులెత్తి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పవన్ కల్యాణ్‌కు సంబంధించిన జనసేన అభిమానులు షేర్ చేసి వైరల్ చేశారు. ఇదిలా ఉండగా
అంతకుముందు ఈ వేడుకకు మోహన్ బాబు కుటుంబ సభ్యులు విష్ణు మంచు తదితరులు హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X