చీకటి చీల్చే చెగువేరా: పవన్‌ కల్యాణ్‌కు వినాయక్, హైపర్ ఆది, ఎంపీల బర్త్ డే విషెస్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన 48వ జన్మదినోత్సవాన్ని అభిమానుల ఆనందోత్సవాలు, సెలబ్రటీ సందేశాల మధ్య ఘనంగా జరుపుకొంటున్నారు. పవన్ బర్త్ డే‌ను పురస్కరించుకొని సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు సోషల్ మీడియాలో స్పందించారు. యువతారలుు షాలిని పాండే, రష్మిక, దర్శకుడు సంపత్ నంది, యాంకర్ అనసూయ భరద్వాజ్ ట్వీట్ల మోత మోగించారు. ఇంకా ఎవరెవరూ ట్వీట్లతో బర్త్ డే విషెస్ తెలిపారంటే..

బాబా సెహగల్ ట్వీట్

పవన్ కల్యాణ్‌కు హిందీ గాయకుడు బాబా సెహగల్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. పవర్ స్టార్ జన్మదిన సందర్భంగా.. పవర్.. పవన్ అంటూ బాబా సెహగల్ సొంతంగా పాటను పాడి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బాబా సెహగల్ పాట మీరే వినండి...

వీవీ వినాయక్ ట్వీట్

వీవీ వినాయక్ ట్వీట్

పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా దర్శకుడు వీవీ వినాయక్ ట్వీట్ చేశారు. పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా, హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆచార్యుడా, చీకటిని చీల్చే చేగువేరా మన జనసేనుడు అంటూ వినాయక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రేమతో హైపర్ ఆది సందేశం

ప్రేమతో హైపర్ ఆది సందేశం

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కల్యాణ్‌‌కు విషెస్ తెలియజేశారు. ఈ గణేష్ చతుర్థి ఎన్నడూ లేని ఆనందాన్ని నింపింది. పవన్ కల్యాణ్ జన్మదినం కూడా కావడంతో కొత్త అనుభూతికి లోనయ్యాను. నా బాస్ గురించి తలుచుకొన్నప్పుడల్లా నా రోమాలు నిక్కబొడుస్తున్నాయి అంటూ ఆది ట్వీట్ చేశాడు.

నిర్మాత శరత్ మారార్ ట్వీట్

నిర్మాత శరత్ మారార్ ట్వీట్

పవన్ కల్యాణ్‌కు ఆయన సన్నిహితుడు, నిర్మాత శరత్ మరార్ జన్మదిన శుభాకాంక్షలు అందజేశాడు. హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్.. మీరు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి. రాబోయే రోజులు మీకు మంచి కలుగుజేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

మెగా బ్రదర్ నాగబాబు విషెస్

మెగా బ్రదర్ నాగబాబు విషెస్

నా సోదరుడు పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేశారు. అందరిలో స్ఫూర్తి కలిగించే అంశాన్ని కొనసాగిస్తూనే ఉండాలి అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్

ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్

పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ స్పందించారు. పవన్ కల్యాణ్ గారికి బర్త్ డే విషెస్. భగవంతుడు మీకు సుఖ: సంతోషాలను, విజయాలను అందజేయాలని కోరుకొంటున్నాను అంటూ జయదేవ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్వీట్

ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్వీట్

పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు నాయుడు కే స్పందించారు. పవన్ కల్యాణ్‌ గారు మీ అద్భుతమైన కెరీర్‌ను తృణపాయంగా భావించి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవ విషయంలో ఎంతో మంది యూత్‌కు స్ఫూర్తిగా నిలిచావు. మీ భవిష్యత్ కార్యచరణ మీకు మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకొంటున్నాను అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 బిగ్‌బాస్ విజేత కౌశల్ ట్వీట్

బిగ్‌బాస్ విజేత కౌశల్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్‌బాస్ విజేత కౌశల్ మండా ట్వీట్ చేశారు. మీరు అద్భుతమైన వ్యక్తి. ఈ ప్రత్యేకమైన రోజు మరో గొప్ప సంవత్సరానికి నాంది కావాలని కోరుకొంటున్నాను. ఈ పుట్టిన రోజు గొప్పగా జరుపుకోవాలని అనుకొంటున్నాను. గతేడాది ఇదే రోజు బిగ్‌బాస్‌లో ఎర్రటి దుస్తులు ధరించి జై పవర్ స్టార్ అని గట్టిగా అరిచాను. హ్యాపీ బర్త్ డే పవన్ సార్ అని కౌశల్ ట్వీట్ చేశారు.

రాంచరణ్ ఎమోషనల్‌గా

రాంచరణ్ ఎమోషనల్‌గా

బాబాయ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పందించారు. కల్యాణ్ బాబాయ్‌కి నా జన్మదిన శుభాకాంక్షలు. నా మెంటర్‌‌గా, గైడ్‌గా, స్నేహితుడిగా నా జీవితంలోకి వచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను. నీవు అంటే నాకు చెప్పలేనంత ప్రేమ. హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాన్ గారు అంటూ ఇన్స్‌టాగ్రాహ్‌లో చేశారు.

అందాల తార రాయ్ లక్ష్మీ ట్వీట్

అందాల తార రాయ్ లక్ష్మీ ట్వీట్

అందాల తార రాయ్ లక్ష్మీ తనదైన శైలిలో పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. మంచి మానవత్వం, దయాగుణం ఉన్న మధురమైన వ్యక్తివి నీవు. ఇప్పటి వరకు నేను కలిసి పనిచేసిన వ్యక్తుల్లో పవన్ ప్రత్యేకమైన వ్యక్తి. ఈ ఏడాది మీకు అంతా మంచి జరుగాలని కోరుకొంటున్నాను. ఈ జన్మదినం వేళ మీకు శుభాంకాక్షలు అంటూ ఇన్స్‌టాలో ఓ ఫోటోతో సందేశాన్ని పోస్టు చేశారు.

గొప్ప లీడర్ అంటూ ఎస్‌కేఎన్ ట్వీట్

గొప్ప లీడర్ అంటూ ఎస్‌కేఎన్ ట్వీట్

నాకు స్ఫూర్తి, కాలేజీలో నాకు ఆదర్శం, పవర్ స్టార్ మాత్రమే కాదు గొప్ప లీడర్, మానవతావాది. పవర్‌ఫుల్ పవన్ కల్యాన్ గారికి హ్యాపీ బర్త్ డే. నాయకుడిగా మీకు కమిట్‌మెంట్ ఉంది. స్టార్‌గా మీకు పరిశ్రమలో సుస్థిరమైన స్థానం ఉంది అంటూ టాక్సీవాలా నిర్మాత, పీఆర్‌వో ఎస్‌కేఎన్ ట్వీట్ చేశారు.

జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్

జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్

నాకు అత్యంత ఇష్టమైన జనసేనాని పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. జనసేన పార్టీ ద్వారా జాతి నిర్మాణం లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే పోరాటం కలిసి చేద్దాం అంటూ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X