కుట్రలు ఎదురించిన ధీరుడు.. జీవితం స్ఫూర్తిదాయకం.. చిరంజీవికి పవన్ ఎమోషనల్ విషెస్

తెలుగు సినీ పరిశ్రమలో అతి చిన్న స్థాయి నుంచి విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో మెగాస్టార్‌గా ఎదిగిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి 64వ జన్మదినోత్సవాన్ని ఆగస్టు 22న జరుపుకోవడం తెలిసిందే. మెగాస్టార్ జన్మదినాన్ని కోట్లాది మంది తమ జన్మదినంగా భావిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. గురువారం బర్త్ డే జరుపుకోనున్న చిరంజీవి కోసం ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ అభిమానిగా మారి సోషల్ మీడియాలో తన గుండె చప్పుడును వినిపించారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ రాసిన ఎమోషనల్ లెటర్ మీ కోసం..

 మెగాస్టార్ కాదు.. మూర్తిభవించిన స్ఫూర్తి

మెగాస్టార్ కాదు.. మూర్తిభవించిన స్ఫూర్తి

నాకు స్పూర్తి ప్రదాత చిరంజీవి గారి జన్మదినం. అభిమానులందరికీ పండుగ రోజు. చిరంజీవి గారంటే కేవలం మెగాస్టార్ కాదు. మూర్తిభవించిన స్ఫూర్తి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకొనేందుకు కష్టపడటం అనే జీవన వేదానికి చిరంజీవి గారి ప్రస్థానం నిదర్శనం. కలలు సాకారమై, శిఖరాలను అధిరోహించిన తర్వాత నిగర్వంగా, నిరాడంబరంగా ఉండటం, తన మూలాలను మరిచిపోని సృహతో ఉడటం లాంటి జీవన విలువలకు ప్రతీక. చిరంజీవి గారు తానే ఒక సందోహం.. తన జీవితమొక సందేశం.

 నేనొక పరమాణువును

నేనొక పరమాణువును

చిరంజీవి సందేశాన్ని అందిపుచ్చుకొన్న లక్షల మంది యువతరంలో నేనొక పరమాణువును కావడం అదృష్టం. అంతకుమించి, ఆయన తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం. అన్నయ్య చిరంజీవి నరసాపురంలో విద్యార్థిగా ఎన్‌సీసీలో ఉన్ననాటి నుంచి, మద్రాసులో యాక్టింగ్ విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి.. ఈ రోజు వరకు అదే ఉక్కు క్రమశిక్షణ. అదేస్థాయిలో అనితర సాధ్యమైన నేర్చుకునే తత్వం. అసామాన్యమైన తన ప్రస్థానంలో ఎన్నెన్ని ఎదురుదెబ్బలు, కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని తొక్కేసుకొంటూ ఉన్నత శిఖరాలకు ఎగబాకిన ధీరత్వం. ఆయన వేసే ప్రతీ అడుగు ఆదర్శం, అనుసరణీయం.

 ఆయన జీవితం స్ఫూర్తిదాయకం

ఆయన జీవితం స్ఫూర్తిదాయకం

చిరంజీవి ప్రస్తుతం యావత్ భరతజాతి విస్మరించిన అస్తుత సమరాగ్రేసురుడు. అగణ్య ధీరాగ్రేసరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆసేతు హిమనగమూ భళీ భలీయని ప్రతిధ్వనించేలాగా సైరా అంటూ సినీ ప్రియులకు కానుకగా అందిస్తున్న చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా తరఫున, జనసైనికుల తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి. ఆయన జీవితం మరింత మందికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉండాలని కోరుకొంటున్నాను.

అష్టదిక్కులకు విస్తరించేలా

అష్టదిక్కులకు విస్తరించేలా

ఆకాశం ఎప్పటికీ అలా నిశ్చలంగా, నిర్లిప్తంగా ఉంటుంది. కానీ దాని వలన గాలి అష్టదిక్కులకూ విస్తరిస్తుంది. చిరంజీవి గారు మౌనిగా, మునిగా సుస్థిరంగా ఉంటారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నవతరాలను తీర్చిదిద్దుతూనే ఉంటుంది అంటూ ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ తన హృదయ స్పందనను వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X