పవన్‌కు అన్నీ ఫ్లాపులే.. కానీ క్రేజ్ ఆకాశమంత.. పవర్‌స్టార్‌గా మార్చిన సినిమాలేంటో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో హిట్లకన్నా ఫ్లాపులే ఎక్కువగా పలకరించాయి. అయినా ఆయన క్రేజ్ మాత్రం ఆకాశానికి తాకినట్టుగా ఉంటుంది. సినిమా ఆడకపోయినా రెట్టింపు పాపులారిటీ పెరగడం లాంటి ఘనత పవన్ కల్యాణే దక్కింది. అందుకు కారణం ఆయన స్టయిల్, యాటిట్యూడ్ కారణమని ఫ్యాన్స్ చెప్పుకొంటారు. అయితే పవన్ కల్యాణ్‌ను పవర్ స్టార్‌గా మార్చిన సినిమాలు ఏంటో తెలుసా?

అత్తారింటికి దారేది
పవన్ కల్యాణ్‌కు మాస్, కెరీర్ హయ్యెస్ట్ హిట్ ఇచ్చింది అత్తారింటికి దారేది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం వినోదపరంగాను, ఎమోషనల్‌గాను ఆకట్టుకొన్నది. దాంతో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. దాంతో పవన్ స్టామినా బాక్సాఫీస్ వద్ద మరోసారి రుజువైంది. దాంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది.

గబ్బర్ సింగ్
పవన్ కల్యాణ్ హిట్టు కోసం పరితపిస్తున్న తరుణంలో 2012లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన దంబంగ్ సినిమాకు రీమేక్. ఈ సినిమాలో డైలాగ్స్ ఫ్యాన్స్‌ను కేక పెట్టించాయి. శృతిహాసన్, పవన్ కల్యాణ్ కెమిస్ట్రీ అభిమానులకు గిలిగింతలు పెట్టింది. పవన్ అగ్రెసివ్ యాక్టింగ్ మరింత క్రేజ్‌ను పెంచింది.

జల్సా
వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం జల్సా. మంచి కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాన్స్ విశేషంగా ఆకట్టుకొన్నది. పాటలతోపాటు, ఇలియానాతో రొమాన్స్ ఫ్యాన్స్‌కు చేరువ చేసింది. పవన్ కల్యాణ్ ఎమోషనల్ యాక్టింగ్ ఫ్యాన్స్‌ను రంజింపజేసింది. దాంతో పవన్ కెరీర్‌లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది.

ఖుషీ
పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఖుషీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తమిళ చిత్రానికి రీమేక్‌గా ఎస్‌జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. భూమిక చావ్లా, పవన్ పోటాపోటిగా నటించిన ఈ చిత్రం మంచి ఫీల్‌గుడ్ లవ్ స్టోరిగా నిలిచింది. సిద్దూ సిద్దార్థ్ రాయ్ అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ కేక పెట్టించాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

బద్రి
పవన్ కల్యాణ్ మంచి జోష్ మీద ఉన్న సమయంలో వచ్చిన ఫస్ట్ కమర్షియల్, స్టయిల్‌తో ఉన్న చిత్రం బద్రి. పూరి జగన్నాథ్ తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అయ్యారు. రేణు దేశాయ్, అమీషా పటేల్ గ్లామర్ పంట పండించారు. ఇక సినిమాలోని డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో ప్రేక్షకులు రెచ్చిపోయారు. లవ్ స్టోరి యూత్‌కు పిచ్చి పిచ్చిగా నచ్చేయడంతో పవన్ కాస్తా పవర్ స్టార్‌గా మారిపోయాడు.

తొలి ప్రేమ..
పవన్ కల్యాణ్‌కు అతిపెద్ద హిట్‌ను ఇవ్వడమే కాదు.. స్టార్ స్టాటస్‌ను తీసుకొచ్చిన చిత్రం తొలి ప్రేమ. తెర మీద కీర్తీ రెడ్డి అందాల దేవతగా కనిపించడంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేమ కోసం పరితపించే పవన్‌లో సగటు ప్రేక్షకుడు తనలో తనని చూసుకొన్నాడు. దాంతో సినిమా సంవత్సరం పాటు ఏకధాటిగా ప్రదర్శింపపడింది.

ఇక తమ్ముడు..
పవన్ కల్యాణ్‌కు తొలి కమర్షియల్ హిట్ తమ్ముడు. సుస్వాగతం లాంటి సినిమాలతో అప్పుడప్పుడే సెటిల్ అవుతున్న పవన్‌ను క్రేజీ హీరోగా నిలబెట్టింది ఈ చిత్రం. ఈ సినిమా హిందీ జో జీతా వహీ సికందర్ సినిమాకు రీమేక్. హిందీలో అమీర్ ఖాన్‌ను, తెలుగులో పవన్ కల్యాణ్‌ను స్టార్ హీరోగా మార్చేసింది.


Click it and Unblock the Notifications











