47 ఏళ్ల ప్రాణం ఖరీదు.. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంపై పవన్ కల్యాణ్ ఎమోషనల్ ట్వీట్

శివ శంకర వరప్రసాద్‌ కొణిదెలగా తెలుగు సినిమా పరిశ్రలోకి అడుగుపెట్టి స్వశక్తితో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, గాడ్ ఫాదర్ లేకుండా చిన్నస్థాయి నటుడిగా కెరీర్ ప్రారంభించి మెగాస్టార్ అవతరించారు చిరంజీవి. ఆయన నటించిన ప్రాణం ఖరీదు చిత్రం రిలీజై సెప్టెంబర్ 22వ తేదీకి 47 ఏళ్లు పూర్తయ్యాయి. దాంతో ఆయన నట ప్రస్థానం గురించి సినీ ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు చర్చించుకొంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి స్వయంగా తన అనుభవాలను పంచుకోగా.. తన పెద్ద అన్నయ్య గురించి పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ఇద్దరి అనుబంధాల గురించిన వివరాల్లోకి వెళితే..

22 సెప్టెంబర్ 1978. 'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను "ప్రాణం ఖరీదు" చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ "ప్రేమ". ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ...
కృతజ్ఞతలతో మీ చిరంజీవి అంటూ ట్వీట్ చేశారు.

Praanam Khareedhu completed 47 Years

మెగాస్టార్ చిరంజీవి 47 ఏళ్ల ప్రయాణం గురించి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ చేస్తూ.. పెద్దన్నయ్య ప్రాణం ఖరీదు సినిమాలో హీరోగా నటించిన క్షణాల గురించి నాకు చూఛాయగా గుర్తు ఉన్నాయి. ఆ సమయంలో మేము నెల్లూరులో ఉన్నాం. అప్పుడు నేను స్కూల్‌కు వెళ్తున్నాను. మేము కనకమహహల్ థియేటర్‌కు వెళ్లి ఆ సినిమాను చూసిన అనుభూతిని నా మాటల్లో చెప్పలేను అని ఆ సందర్భాన్ని గుర్తు చేసకొన్నారు.

మెగాస్టార్‌గా 47 ఏళ్ల సినీ ప్రయాణం ఎంతో స్పూర్తిని కలిగిస్తుంది. ప్రతీ విషయంలో ఆయన ఎదిగిన విధానం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎదిగిన కొద్ది ఒదిగిన తీరు.. ఇతరులకు సహాయం అందించే విషయంలో ఆయన చూపించే చొరవ హృదయాన్ని తట్టి లేపుతుంది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఆయనకు సాధించిన సక్సెస్, సంపూర్ణ ఆరోగ్యం, సంపదకు దుర్గామాత ఆశీస్సులు ఉన్నాయని భావిస్తున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలను పోషించాలని కోరుకొంటున్నాను. ఆయన కోరుకొంటే తప్పా.. అన్నయ్యకు రిటైర్మెంట్ అనేదే ఉండదు. అలాంటి నిర్ణయాన్ని ఆయన తీసుకొంటారని నేను అనుకోవడం లేదు అని అన్నారు.

చిరంజీవి గారు.. పుట్టుకతోనే ఫైటర్. అందరూ మెగాస్టార్ చిరంజీవిగా ఆరాధించే పెద్దన్నయ్యను ముద్దుగా మేమంత శంకర్ బాబు పిలుచుకొంటాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X