మా వదిన నాకు ద్రోహం చేసింది.. హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రమే.. పవన్ కల్యాణ్

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మించిన చిత్రం బ్రో (BRO The Avatar). తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్ సినిమా ఆధారంగా తెలుగులో రూపొందించిన బ్రో సినిమాకు నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, ప్రియా వారియర్, కేతిక శర్మ, ఊర్వశి రౌటేలా, రోహిణి తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

బ్రో సినిమా ఎక్కువ రోజులు చేయాల్సిన సినిమా. నేను పొలిటికల్ రంగంలోకి వెళ్లిన తర్వాత నా మైండ్ సెట్ కొంత మారిపోయింది. సినిమాలంటే నాకు ఇష్టం. సమాజం నాకు బాధ్యత. సినిమా అంటే చాలా ప్రేమ. ఎన్టీఆర్, రాంచరణ్ మాదిరిగా గొప్పగా డ్యాన్స్ చేయలేకపోవొచ్చు. ప్రభాస్, రానా మాదిరిగా నేను బాడీని పెంచలేకపోవచ్చు. ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెందినది కాదు. ఈ పరిశ్రమ అందరిది. మీరు బలంగా అనుకొంటే సినిమా పరిశ్రమలో రాణించగలరు.

Pawan Kalyan emotional words about Chiranjeevi and Surekha Konidela at BRO pre release event

చిరంజీవి గారు సగటు, దిగువ మధ్య తరగతి కుటుంబ నుంచి వచ్చిన వాళ్లం. మాకు ఎవరు అండదండలు లేరు. చిరంజీవి మెగా స్టార్ డమ్ సాధించిన తర్వాత హీరో అవుతారా అంటే.. నా దృష్టిలో చిరంజీవి మాత్రమే హీరో. కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ పెద్ద నటులు. నేను హీరో అని ఊహించుకోలేదు. నేను చిన్న ఉద్యోగం చేసి వ్యవసాయం చేయాలనుకొన్నాను. సాహిత్యం చదవడం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల సినిమా రంగంలోకి తీసుకొచ్చారు మా వదిన గారు.

మనల్ని నమ్మేవారు ఉండాలి. నేను హీరోగా మారిన తర్వాత సుస్వాగతం పాట షూట్ జగదాంబ సెంటర్‌లో బస్సుపై డ్యాన్స్ చేయమంటే చచ్చిపోయాను. పదిమందిలో డ్యాన్స్ చేయడం, నటించడమంటే నాకు సిగ్గు. అందుకే నేను ఏడ్చి మా వదినకు ఫోన్ చేశాను. నన్ను ఎందుకు ఎగదోశాడు. నీవు చెప్పకపోతే నా పాటికి చిన్న జీవితం గడిపేవాడిని. మా వదిన చేసిన ద్రోహానికి నేను ఇలా మీ ముందు ఉన్నాను.

Pawan Kalyan emotional words about Chiranjeevi and Surekha Konidela at BRO pre release event

చిరంజీవి తమ్ముడిగా నేను ఏది గ్రాంటెడ్‌గా తీసుకోను. కష్టపడి పనిచేయాలని అనుకొంటాను. నేను సన్నగా నీట్‌గా కనిపిస్తాను. కానీ నేను చాలా మొరటి వాడిని. కానీ నేను త్రికరణశుద్దిగా పనిచేయడం వల్లే నేను ఈ స్థాయిలో మీ ముందు ఉన్నాను. ప్రతీ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని చెబుతాను. కష్టపడుదామని చెబుతాం. మేము గొడ్డు చాకిరి చేస్తాం కాబట్టే మా ఇంటి నుంచి ఇంత మంది హీరోలు వచ్చారు. మధ్య తరగతి నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు. మీరు ఏది అనుకొంటే అది చేయగలరు అని పవన్ కల్యాణ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X