For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవర్ స్టార్ ఫ్యాన్స్ అడ్వాన్స్ బుక్కింగ్స్.. హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం అంటే ఇదే!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువతలో అభిమానం ఏ తరహాలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఎప్పుడూ ఒకే తరహాలో కొనసాగుతూ వస్తున్నాడు. ఫ్యాన్స్ కూడా పవర్ స్టార్ బాటలోనే అడుగులు వేస్తున్నారు. ఆయనపై అంతకంతకూ ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు కూడా ఎంతగానో ఇష్టపడతారు. ఇక ఆయన పుట్టిన రోజు వస్తుంది అంటే ఒక వారం ముందు నుంచే ఆ సందడి కనిపిస్తుంది.

  గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా అడ్వాన్స్ విషెస్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే పవర్ స్టార్ 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు.

  వయసుతో సంబంధం లేకుండా

  వయసుతో సంబంధం లేకుండా

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మిగతా హీరో హీరోయిన్స్ కూడా ఎంతగానో ఇష్టపడతారు. సెలబ్రిటీలే ఆయన పుట్టిన రోజు ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రామాల నుంచి పట్టణాల వరకు వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కూడా పవర్ స్టార్ బర్త్ డే ట్యాగ్స్ దర్శనమిస్తున్నాయి.

  ఈసారి మాత్రం కాస్త గట్టిగానే

  ఈసారి మాత్రం కాస్త గట్టిగానే

  ఇప్పటికే స్పెషల్ గా ఫ్యాన్ మెడ్ పుట్టినరోజు పోస్టర్లను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక బర్త్ డే కామన్ డీపీ కూడా వైరల్ అవుతూనే ఉంది. గత ఏడాది కరోనా కారణంగా పుట్టినరోజు వేడుకలను సరిగ్గా జరుపుకోలేదు. ఈసారి మాత్రం కాస్త గట్టిగానే ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఏరియాలలో లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బ్యానర్లు కటౌట్లు గట్టిగానే తగిలించారు. తెలంగాణలో కూడా పవర్ స్టార్ కు అభిమానులు చాలామంది ఉన్నారు.

  హాట్ కేకుల్లా..

  హాట్ కేకుల్లా..

  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే బాగానే వైరల్ అవుతుంది. ఒక నెటిజన్ ఈ విధంగా పోస్ట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే ఇప్పటికే 20 కేకులు ఆర్డర్ కు రెడీగా ఉన్నట్లు బేకరీ అంకుల్ చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా ఈ పుట్టినరోజు వేడుక మామూలుగా ఉండదు అంటూ అందుకు సంబంధించిన ఫోటో కూడా పోస్ట్ చేశాడు.

  కేకులపై పవన్ కళ్యాణ్ డిఫరెంట్ స్టైల్ ఫోటోలు కూడా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. సినిమాలు ఉన్నా లేకపోయినా, రాజకీయాల్లో దారుణమైన ఓటమి చూసినా కూడా పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గలేదు అని అర్థమవుతోంది.

  భీమ్లా నాయక్ అప్డేట్

  భీమ్లా నాయక్ అప్డేట్

  ప్రస్తుతం పవర్ స్టార్ వరుసగా నాలుగు సినిమాలలో లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే ముందుగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ భీమ్లా నాయక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్లా నాయక్ కు సంబంధించిన మొదటి టైటిల్ సాంగ్ ను కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రేపే విడుదల చేయబోతున్నారు.

  Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Filmibeat Telugu
  స్పెషల్ పోస్టర్స్

  స్పెషల్ పోస్టర్స్

  అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే ఒక మాస్ మసాలా యాక్షన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. రేపు అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే దర్శకనిర్మాతలు అందరూ కూడా స్పెషల్ పోస్టర్లతో మంచి కిక్కు ఇవ్వనున్నారని అర్థమవుతోంది.అలాగే హరహర వీరమళ్లు సినిమాతో పాటు సురేందర రెడ్డి దర్శకత్వంలో కూడా అలా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Pawan kalyan fans hungama started with before birthday day
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X