పవన్ కల్యాణ్ కోసం ఫ్యాన్స్ వినూత్న పనులు: ఏకంగా దాన్ని తీసుకెళ్లి పూజలు.. ఫొటోలు వైరల్

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ఆయనకు ఉన్నంత మంది అభిమానులు మరే హీరోకూ లేడు అన్న టాక్ కూడా ఉంది. అంతలా వాళ్లు ప్రభావం చూపిస్తూ ఉంటారు. సినిమాల విడుదల సమయంలోనే కాదు.. సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం ముందుంటూ మంచి పేరును తెచ్చుకుంటున్నారు. అలాంటిది తమ ఆరాధ్య దైవం అయిన పవన్‌కు ఏదైనా సమస్య వస్తే.. ఎలా స్పందిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడదే చేస్తున్నారు. తాజాగా పవన్ కరోనా బారిన పడగా వాళ్లంతా వినూత్న పనులు చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!

నటుడు వివేక్‌కు శ్రద్దాంజలి ఘటించిన సినీ ప్రముఖులు.. కన్నీరుమున్నీరైన అభిమానులు

 ‘వకీల్ సాబ్'తో రీఎంట్రీ.. రికార్డులు బద్దలు

‘వకీల్ సాబ్'తో రీఎంట్రీ.. రికార్డులు బద్దలు

దాదాపు మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్‌లు కీలక పాత్రలు చేశారు. 'పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ ఎన్నో రికార్డులు కొట్టింది.

పండగలా చేసిన ఫ్యాన్స్... భారీ స్థాయిలో

పండగలా చేసిన ఫ్యాన్స్... భారీ స్థాయిలో

చాలా గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో పవన్ కల్యాణ్ అభిమానులు దీన్ని పండుగలా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే 'వకీల్ సాబ్' మూవీ విడుదలయ్యే థియేటర్లను అందంగా ముస్తాబు చేసి.. జాతరలను తలపించేలా సందడి చేశారు. అదే సమయంలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందించి అత్యధిక ఓపెనింగ్స్ వచ్చేలా చేశారు.

 వాళ్లందరికీ కోవిడ్.. క్వారంటైన్‌లోకి పవన్

వాళ్లందరికీ కోవిడ్.. క్వారంటైన్‌లోకి పవన్

'వకీల్ సాబ్' మూవీకి సంబంధించిన పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వాళ్లతో పాటు పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. దీంతో ఈ స్టార్ హీరో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా అన్ని కార్యకలాపాలు చేస్తారని వెల్లడించారు.

కరోనా వైరస్ బారిన పడిన పవన్ కల్యాణ్

కరోనా వైరస్ బారిన పడిన పవన్ కల్యాణ్

క్వారంటైన్‌లో గడుపుతోన్న సమయంలోనే కొన్ని లక్షణాలు ఉండడంతో పవన్ కల్యాణ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారని తెలుస్తోంది. ఇందులో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. ప్రస్తుతం ఆయన ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

స్పందించిన సినీ పరిశ్రమ.. కోలుకోవాలని

స్పందించిన సినీ పరిశ్రమ.. కోలుకోవాలని

పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్ రావడంతో సినీ పరిశ్రమ మొత్తం ఉలిక్కి పడింది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా మహేశ్ బాబు, నవీన్ పోలిశెట్టి సహా పలువురు హీరోలు ట్వీట్లు చేశారు. మిగిలిన చాలా మంది నటులు కూడా పోస్టులు పెడుతున్నారు.

Recommended Video

Pawan Kalyan కి Covid పాజిటివ్, ఊపిరితిత్తుల్లో నిమ్ము, పూర్తి వివరాలు !!
పవన్ కల్యాణ్ కోసం ఫ్యాన్స్ వినూత్న పని

పవన్ కల్యాణ్ కోసం ఫ్యాన్స్ వినూత్న పని

తమ అభిమాన నటుడు కరోనా బారిన పడడంతో పవన్ కల్యాణ్ అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గుడికి వెళ్లి మరీ ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో పవన్ కటౌట్‌ను దేవాలయానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X