twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sarkaru Vaari Paata సంక్రాంతి సినిమా అయితే.. మరీ భీమ్లా నాయక్ కాదా? రాజమౌళిపై పవన్ ఫ్యాన్స్ దారుణంగా ట్వీట్స్

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పించిన తర్వాత సోషల్ మీడియాలో భారీగా ట్వీట్స్, ట్రోలింగ్‌ పోటెత్తాయి. పరిశ్రమ బాగు కోసం అనే ట్యాగ్‌తో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ వాయిదా వేయడంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్లను నెటిజన్లు సీరియస్‌గా తీసుకొన్ని భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ వివాదంలోకి వెళితే..

    సర్కారు వారీ పాటను సమ్మర్‌కు..

    సర్కారు వారీ పాటను సమ్మర్‌కు..

    భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ వాయిదా పడిన తర్వాత రాజమౌళి వేసిన మొట్టమొదటి ట్వీట్ చేస్తూ.. సంక్రాంతి రిలీజ్ సినిమాల విడుదల విషయంలో తలెత్తిన గందరగోళాన్ని నివారించేందుకు మహేష్ బాబు మంచి నిర్ణయం, చొరవ తీసుకొన్నారు. సర్కారు వారి పాట వాస్తవానికి సంక్రాంతి సినిమా. కానీ RRR కోసం తన సినిమాను వేసవికి షిఫ్ట్ చేసి.. ఇండస్ట్రీలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. అందుకు నా హీరోకు థ్యాంక్స్ అంటూ జక్కన్న ట్వీట్‌లో పేర్కొన్నారు.

    పవన్ కల్యాణ్‌కు థ్యాంక్స్ అంటూ రాజమౌళి

    పవన్ కల్యాణ్‌కు థ్యాంక్స్ అంటూ రాజమౌళి

    అయితే సంక్రాంతి పోటీ నుంచి తప్పుకొన్న తర్వాత పవన్ కల్యాణ్, చిన్నబాబును ఉద్దేశించి సింపుల్‌గా రాజమౌళి ట్వీట్ చేస్తూ.. భీమ్లా నాయక్ రిలీజ్‌ను వాయిదా వేసుకొన్నందుకు చిన్నబాబు, పవన్ కల్యాణ్‌ను అభినందిస్తున్నాను. ఈ యూనిట్‌కు అంతా శుభం జరుగాలని మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    భీమ్లా నాయక్ సంక్రాంతి సినిమా కాదా?

    భీమ్లా నాయక్ సంక్రాంతి సినిమా కాదా?

    అయితే మహేష్ బాబును ఆకాశానికి ఎత్తేస్తూ.. పవన్ కల్యాణ్‌కు మొహమాటంగా థ్యాంక్స్ చెప్పడంపై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. సర్కారు వారి పాట సంక్రాంతి సినిమా అయితే.. భీమ్లా నాయక్ పొంగల్ సినిమా కాదా? రాజమౌళి గారు అంటూ ఏకి పాడేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ కాని సర్కారు వారి పాటను మహేష్ వాయిదా వేసుకొంటే గొప్ప.. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాను వాయిదా వేసుకొంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలగదా? మీతో మహేష్ బాబు సినిమా చేస్తున్నందుకే ట్వీట్లలో అంత పక్షపాతమా? అని రాజమౌళిని దులిపేస్తున్నారు.

    పరిశ్రమ బాగు కోసం అంటూ

    పరిశ్రమ బాగు కోసం అంటూ


    పరిశ్రమ బాగు కోసం అంటూ దిల్ రాజు, ప్రొడ్యూసర్ గిల్డ్ సభ్యులు చెప్పడంపై సిని నిర్మాతలను కడిగిపడేస్తున్నారు. పరిశ్రమ బాగు కోసం పవన్ కల్యాణ్ తన గొంతును వినిపించినప్పుడు ఎవరూ కూడా ఆయనకు సపోర్ట్‌గా నిలువలేదు. ఏపీ ప్రభుత్వంతో కలిసి సొంతంగా సంప్రదింపులు జరుపుకొన్నారు. భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేయడానికి పరిశ్రమ బాగు గుర్తొచ్చిందా? ఫిబ్రవరిలో పవన్ కల్యాణ్ సినిమాకు ఏపీ ప్రభుత్వం అడ్డుపడితే నిర్మాతలు పెదవి విప్పుతారా? అని దిల్ రాజు, ఇతర నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు.

    నిజమైన పవన్ కల్యాణ్ అభిమానియేనా?

    నిజమైన పవన్ కల్యాణ్ అభిమానియేనా?

    పవన్ కల్యాణ్‌కు అభిమాని అని చెప్పుకొనే కొందరు నిర్మాతలు భీమ్లా నాయక్‌ సినిమాను ఆపేందుకు చాలా పకడ్బందీగా పావులు కదిపారు. నిజమైన అభిమాని అయితే భీమ్లా నాయక్‌ రిలీజ్‌ను వాయిదా వేయరు అని పవన్ కల్యాణ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. భీమ్లా నాయక్ వాయిదా పడిన వెంటనే Pawan Kalyan, SS Rajamouli, Bheemla Naayak హ్యాష్ ట్యాగ్ యమ ట్రెండింగ్‌గా మారాయి.

    ఉద్దేశపూర్వకంగానే వాయిదా అంటూ..

    ఉద్దేశపూర్వకంగానే వాయిదా అంటూ..

    సంక్రాంతికి భీమ్లా నాయక్‌ సినిమాను ఆపేందుకు రాజకీయంగా కూడా కొందరు పావులు కదిపారు. తెరవెనుక భారీగా కుట్ర జరిగింది. ఉద్దేశపూర్వకంగానే భీమ్లా నాయక్‌ను సంక్రాంతి బరిలో నుంచి తప్పించారు అనే విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనే విషయం కొద్ది రోజులు ఆగితే తేటతెల్లం కానున్నది.

    English summary
    Pawan Kalyan fans trolls over SS Rajamouli tweet. urstrulyMahesh was the one who took the initative in decluttering the Pongal releases... Even though #SarkaruVaariPaata was a perfect Pongal film, he moved it to summer and created a healthy atmosphere. Thanks to my Hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X