పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ మూవీ టైటిల్ రివీల్.. డైరెక్టర్ చేసిన పని వల్లే లీక్

By Manoj Kumar P

పవర్ స్టార్ పవన్ కల్యాణ్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడే అయినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న ఈయన.. తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరో అయిపోయాడు. సరికొత్త స్టైల్స్‌తో యూత్‌ను తన వైపునకు తిప్పుకుని భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో పవన్.. హరీశ్ శంకర్‌తో చేయబోయే సినిమా టైటిల్ రివీల్ అయిపోయింది. వివరాల్లోకి వెళ్తే...

ఊహించని నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్

ఊహించని నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి' తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు పవన్ కల్యాణ్. దీంతో అప్పటి నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ సమయంలో జరిగిన చాలా మీటింగుల్లో ఇకపై సినిమాల్లో నటించనని, రాజకీయాలపైనే దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే, ఊహించని విధంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అతడు డిసైడ్ అయిపోయాడు.

తెలిసిన కథతో సాహసం చేస్తున్న పవర్ స్టార్

తెలిసిన కథతో సాహసం చేస్తున్న పవర్ స్టార్

రీఎంట్రీ మూవీ అంటే మామూలుగానే భారీ అంచనాలు ఉంటాయి. అందునా పవన్ లాంటి బడా హీరో అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఆయన కూడా పక్కా కమర్షియల్ కథను ఎంచుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, పవర్ స్టార్ మాత్రం బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్' అనే మూవీని రీమేక్ చేస్తున్నాడు. ఇది ‘వకీల్ సాబ్' అనే టైటిల్‌తో వస్తోంది.

మరో ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు

మరో ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు

‘వకీల్ సాబ్' పట్టాలెక్కిన కొద్ది రోజులకే పవన్ కల్యాణ్... మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో ఒకటి ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోండగా, ఇంకోటి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో హరీశ్ శంకర్ తీయబోతున్నాడు. ఇందులో క్రిష్ మూవీ పిరియాడిక్ జోనర్‌లో రూపొందుతుండగా.. హరీశ్ మూవీ కమర్షియల్ ఫార్మాట్‌లో వస్తుంది.

గబ్బర్ సింగ్‌ వల్ల దీనిపై పెరిగిపోయిన అంచనాలు

గబ్బర్ సింగ్‌ వల్ల దీనిపై పెరిగిపోయిన అంచనాలు

గతంలో పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో ‘గబ్బర్ సింగ్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీ ‘దబాంగ్'కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించాడు. ఇందులో ఆయనకు జోడీగా శృతి హాసన్ నటించింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో త్వరలో పట్టాలెక్కనున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ మూవీ టైటిల్ రివీల్

హరీశ్ శంకర్ - పవన్ కల్యాణ్ కాంబోలో మూవీ రాబోతుందని ప్రకటన వెలువడినప్పటికీ.. దానికి సంబంధించిన ఏ వివరాలూ బయటకు రాలేదు. అయితే, ఈ మూవీ పక్కా కమర్షియల్ కథాంశంతో రూపొందుతుందని మాత్రం అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నటించబోయే ఈ సినిమా టైటిల్ రివీల్ అయిపోయింది. దీనికి ‘ఇప్పుడే మొదలైంది' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Recommended Video

#8YrsOfGabbarSingh: Then World Wide Box Office Collections, Now Twitter Records
డైరెక్టర్ చేసిన ఆ పని వల్ల పవన్ ఫ్యాన్స్‌కు పండుగ

డైరెక్టర్ చేసిన ఆ పని వల్ల పవన్ ఫ్యాన్స్‌కు పండుగ

గబ్బర్ సింగ్ మూవీ సోమవారంతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఆ చిత్ర విజయానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశాడు. అందులో చివర్లో ‘ఇప్పుడే మొదలైంది.. మేము మళ్లీ వస్తున్నాం' అని రాశారు. అలాగే, ఆ తర్వాత చేసిన ట్వీట్స్‌లో కూడా ఆ టైటిల్‌ను హైలైట్ చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X