పవన్‌ను సీఎం చేసేందుకు చిరంజీవి ప్లాన్.. పెద్దాయన ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం.!

By Manoj Kumar P

మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ఇద్దరూ ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా ఏళ్లుగా ఎన్నో సూపర్ హిట్లను అందుకుంటూ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. దీంతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన ఈ ఇద్దరూ.. రాజకీయాల్లో మాత్రం ప్రతికూల ఫలితాలను అందుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు చిరంజీవి అదిరిపోయే ప్లాన్ రెడీ చేశారని తెలిసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

ఆ విషయంలో మాత్రం మెగా బ్రదర్స్ ఇద్దరూ ఇద్దరే

ఆ విషయంలో మాత్రం మెగా బ్రదర్స్ ఇద్దరూ ఇద్దరే

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ సినిమాల్లో సత్తా చాటారు. టాప్ హీరోలుగా చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించారు. ప్రజాసేవలోనూ ఇద్దరూ ఇద్దరే అనిపించుకునేలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే చిరు.. ‘ప్రజారాజ్యం' అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అలాగే, పవన్ కూడా ‘జనసేన' అనే పార్టీతో క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు.

మళ్లీ అదే దారిలోకి చిరు.. ఫాలో అవుతున్న పవన్

మళ్లీ అదే దారిలోకి చిరు.. ఫాలో అవుతున్న పవన్

రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన చిరంజీవి... ‘ఖైదీ నెంబర్ 150' అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో మరిన్ని సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడదే బాటలో పవన్ కల్యాణ్ కూడా నడుస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కూడా ముఖానికి మేకప్ వేసుకున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

చిరంజీవి నక్సలైట్‌గా.. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌గా

చిరంజీవి నక్సలైట్‌గా.. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌గా

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ మూవీలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా ‘వకీల్ సాబ్' అనే సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ముగ్గురి పేర్లు చెప్పిన చిరు.. పవన్ మరో ఇద్దరితో

ముగ్గురి పేర్లు చెప్పిన చిరు.. పవన్ మరో ఇద్దరితో

‘ఆచార్య'లో నటిస్తున్న చిరంజీవి.. ఆ తర్వాత ‘సాహో' డైరెక్టర్ సుజిత్‌తో సినిమా చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్'కు ఇది రీమేక్. దీని తర్వాత బాబీ, మెహర్ రమేశ్‌తో సినిమాలు ఉంటాయని ఆయనే స్వయంగా ప్రకటించారు. అటు పవన్ కల్యాణ్... ‘వకీల్ సాబ్'తో పాటు క్రిష్ జాగర్లమూడి సినిమాలోనూ నటిస్తున్నాడు. అనంతరం హరీశ్ శంకర్‌తో సినిమా చేస్తాడు.

పవన్‌ను సీఎం చేసేందుకు చిరంజీవి మాస్టర్ ప్లాన్

పవన్‌ను సీఎం చేసేందుకు చిరంజీవి మాస్టర్ ప్లాన్

చిరు, పవన్ గురించి మెగా అభిమానులు పండుగ చేసుకునే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం... ‘ఆచార్య' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘లూసీఫర్'లో పవన్ కల్యాణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడట. అది కూడా ముఖ్యమంత్రి రోల్ అని ప్రచారం జరుగుతోంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఈ పాత్ర ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

పెద్దాయన ఆశీస్సులతో పవన్ ప్రమాణ స్వీకారం.!

పెద్దాయన ఆశీస్సులతో పవన్ ప్రమాణ స్వీకారం.!

‘లూసీఫర్'లో ముఖ్యమంత్రి అయిన సచిన్ కేడ్కర్ మరణించిన తర్వాత అతడి వారసుడిగా టోవినో థామస్ అనే హీరో ఎంట్రీ ఇస్తాడు. అప్పటి వరకు రాజకీయాలు తెలియని అతడికి మోహన్‌లాల్ ట్రైనింగ్ ఇచ్చి సీఎం కుర్చీలో కూర్చునేలా చేస్తాడు. ఇప్పుడు తెలుగు రీమేక్‌లో ఆ పాత్రను పవన్‌తో చేయించబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని సమాచారం.

Recommended Video

Tollywood Stars Unbelievable Support To Vihayy Devarakonda | Filmibeat Telugu
బాలీవుడ్ హీరో కాదు.. మెగా హీరోనే ఉంటాడు

బాలీవుడ్ హీరో కాదు.. మెగా హీరోనే ఉంటాడు

ఈ సినిమాలో పృథ్వీ రాజ్ పోషించిన జయాద్ మసూద్ అనే పాత్రకు సల్మాన్ ఖాన్‌ను తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, అందులో నిజం లేదని తెలిసింది. ఎంతో కీలకమైన ఆ పాత్రను కూడా మెగా హీరోతోనే చేయించబోతున్నారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోల్ కోసం వరుణ్ తేజ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X