మళ్లీ మారిన పవన్ సినిమా టైటిల్... డివోషనల్ టచ్ ఇచ్చిన పవర్ స్టార్
సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన.. కొన్ని నెలల క్రితం మరోసారి ముఖానికి మేకప్ వేసుకున్నాడు. అంతేకాదు, రీఎంట్రీలో వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. 2024 ఎన్నికల సమయానికి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్న పట్టుదలతో ఉన్న పవర్ స్టార్... ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయనున్నాడు. ఇందులో భాగంగానే క్రిష్ దర్శకత్వంలో చేయబోయే సినిమా టైటిల్ విషయంలో పవన్ కల్యాణ్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడట. ఆ వివరాలు మీకోసం.!

నల్లకోటు వేసుకుంటున్న పవన్ కల్యాణ్
‘అజ్ఞాతవాసి' తర్వాత చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్... ‘వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మూవీ ‘పింక్'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ లాయర్‌గా నటిస్తున్నాడు. నివేదా, అంజలి, అనన్య హీరోయిన్లుగా చేస్తున్నారు.

మరో రెండు ఫైనల్... క్లారిటీ ఇచ్చేశారు
‘వకీల్ సాబ్'తో పాటు పవన్ కల్యాణ్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ఆయన పుట్టినరోజున ఆ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. దీని ప్రకారం... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒకటి, హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మరొకటి తెరకెక్కనున్నాయి.

కెరీర్‌లో ఫస్ట్ టైమ్.. అది చాలా ప్రత్యేకం
ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఒప్పుకున్న మూడు చిత్రాల్లో క్రిష్ తెరకెక్కించేంది చాలా ప్రత్యేకమనే చెప్పాలి. దీనికి కారణం ఈ మూవీ పిరియాడిక్ జోనర్‌లో రూపొందుతుండడమే. ఏఎమ్ రత్నం నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా... మొగల్ కాలం నాటి కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది. కోహినూర్ వజ్రానికి సంబంధించిన కథను కూడా దీనికి జోడించారని సమాచారం.

సరికొత్తది.. ఇందులో చాలా ఉన్నాయి
సుదీర్ఘమైన కెరీర్‌లో పవన్ కల్యాణ్ తొలిసారి రాజుల కాలం నాటి కథతో సినిమా చేస్తున్నాడు. ఇందుకోసం తొలిసారి విగ్గును వాడబోతున్నాడట. అంతేకాదు, ఇందులో అతడు రాబిన్‌హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నాడని అంటున్నారు. అలాగే, మరో పాత్ర కూడా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

విరూపాక్షుడు... గజదొంగగా మారాడు
ఈ సినిమాకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చిన సమయంలోనే... దీనికి ‘విరూపాక్ష' అనే టైటిల్ పెడుతున్నట్లు క్లారిటీ వచ్చింది. దీన్నే ఫైనల్ చేస్తారన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి టైటిల్ మార్చేసి.... సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘గజదొంగ' అనే పేరు పెట్టబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ మూవీపై మరింత హైప్ ఏర్పడింది.
Recommended Video

డివోషనల్ టచ్ ఇచ్చిన పవర్ స్టార్.!
తాజాగా అందిన సమాచారం ప్రకారం... క్రిష్ - పవన్ కల్యాణ్ మూవీకి మరోసారి టైటిల్ మార్చేశారట. అంతేకాదు, ఫిలిం చాంబర్‌లో దీని కోసం చిత్ర యూనిట్ ‘ఓం శివమ్' అనే కొత్త టైటిల్‌ను రిజిస్టర్ చేయించిందని తెలుస్తోంది. ఇప్పటికే డివోషనల్ మోడ్‌లో ఉన్న పవన్ కల్యాణ్... తన చిత్రానికి అదే టచ్ ఇచ్చాడన్న వార్త ఫిలిం వర్గాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.


Click it and Unblock the Notifications











