వకీల్ సాబ్ కోసం మళ్లీ క్లీన్ షేవ్.. పవన్ కళ్యాణ్ స్మార్ట్ లుక్!!
పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఎలా ఉన్నాడో అందరికీ తెలిసిందే. గుబురు గడ్డం, జుట్టు పెంచుకుని ఓ యోగిలా ప్రశాంత జీవితాన్ని గడిపాడు. కరోనా వైరస్, లాక్ డౌన్ సమయాల్లో ఫాంహౌస్‌లో ఉంటూ ప్రకృతిని ఆస్వాధించాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇక మేకప్ వేసుకునేందుకు రెడీ అయ్యాడు. అసలే వాయిదాలు పడుతూనే వస్తూ ఉండటంతో వకీల్ సాబ్ మరింత వెనక్కి పోతూ వస్తోంది. అయితే తాజాగా తన యోగి రూపాన్ని తీసేసి మళ్లీ స్మార్ట్ లుక్‌లోకి మారిపోయాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఆ సీన్స్..
పవన్ కళ్యాణ్ ఈ ఆదివారం ‘వకీల్ సాబ్' చిత్రీకరణలో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక కోర్టు సెట్‌లో పవన్ కళ్యాణ్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. సినిమాకు కీలకమైన కోర్టు సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారట. అయితే హీరోయిన్‌తో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది.

లీకులపై ఉక్కుపాదం..
వకీల్ సాబ్ విషయంలో మొదటి నుంచి లీకులు తలనొప్పిగా మారాయి. షూటింగ్ లొకేషన్లలో సీన్స్, ఫోటోలు, స్టిల్స్ సోషల్ మీడియాలో లీకవుతున్నాయి. అయితే ఈసారి మాత్రం అలాంటి ఘటనలేమైనా జరిగితే ఊరికునేది లేదని గట్టి వార్నింగ్‌లు ఇచ్చినట్టు తెలుస్తోంది.

జైలు శిక్షే..
ఈ లీకుల పట్ల నిర్మాత దిల్ రాజు అసహనం వ్యక్తం చేశాడు. అయితే, ప్రస్తుతం సినిమాకు కీలకమైన కోర్టు సీన్స్ చిత్రీకరిస్తున్నారు కాబట్టి అవి లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట దిల్ రాజు. ఇవి గనుక లీకైతే ఆ పనులు చేసిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారట.

తాజా లుక్ వైరల్..
అయితే పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్ చేసుకుని మళ్లీ పాత పవన్ కళ్యాణ్‌లా దర్శనమిచ్చాడు. వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ తన గడ్డాన్ని తీసేసి.. జుట్టను కత్తిరించుకున్నాడు.

వరుసగా సినిమాలు..
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం బోలెడన్ని సినిమాలున్నాయి. వకీల్ సాబ్ అయిపోయిన వెంటనే క్రిష్ సినిమా.. అది లైన్‌లో ఉండగానే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కూడా చేయనున్నాడు. అవి కాకుండానే బండ్ల గణేష్‌తో ఒకటి.. సితారా ఎంటర్టైన్మెంట్స్‌లో మరొకటి కమిట్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











