పవన్ కల్యాణ్ 100 రోజుల లాక్‌డౌన్‌లో ఏం చేశారంటే.. సినీ, పాలిటిక్స్ దూరంగా!
ప్రస్తుత కరోనావైరస్ లాక్‌డౌన్ పరిస్థితుల్లో సినిమాల ప్రదర్శనలు, షూటింగులు నిలిచిపోవడంతో సినీ తారలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే చాలా మంది సోషల్ మీడియా ద్వారా అభిమానులకు, సన్నిహితులకు చేరవయ్యారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, రానా లాంటి వాళ్లు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ చేరువయ్యారు. కొంత మంది సామాజిక బాధ్యతగా కరోనా పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అయితే పవన్ కల్యాణ్ విషయాలకు వస్తే పెద్దగా బాహ్య ప్రపంచంలో, సామాజిక ప్రపంచంలో అంతగా యాక్టివ్‌గా కనిపించలేదు. అయితే గత 100 రోజుల్లో పవన్ కల్యాణ్ ఏం చేశారనే విషయాలు ఇలా ఉన్నాయి.

ఫ్యామిలీకి చేరువగా
కరోనావైరస్ వ్యాప్తి విపరీతంగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ సామాజిక దూరాన్ని స్పష్టంగా పాటించారు. కేవలం కుటుంబానికి మాత్రమే సమయం కేటాయించి వారితో పూర్తిస్థాయిలో టైమ్‌ని ఎంజాయ్ చేసినట్టు తెలిసింది. రాజకీయ పరంగా గానీ, సినిమాలు, సామాజిక కార్యక్రమాలకు చాలా దూరంగా ఉన్నారు. సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పటికీ తనదైన సహకారాన్ని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను సినీ బృందాలు కలిసినప్పటికీ వాటిపై స్పందించకుండా దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశమైంది.

పుస్తక పఠనం, ఓటీటీ, ఫాంహౌస్
ఇక లాక్‌డౌన్ కారణంగా చాలా సమయం అందిరావడంతో తనకు ఇష్టమైన పుస్తకపఠనంపై పూర్తిగా దృష్టిపెట్టినట్టు సమాచారం. అలాగే ఓటీటీలో చూడాల్సిన చాలా సినిమాలను పూర్తి చేశారని, అలాగే ఇటీవల రిలీజైన కొన్ని చిత్రాలను కూడా చూసినట్టు తెలిసింది. ఇక ఆహార అలవాట్ల విషయానికి వస్తే.. ఆర్గానికి ఫుడ్‌ను మాత్రమే తీసుకొన్నారని, తన ఫాంహౌస్‌లో పండిన కూరగాయలు, పండ్లను మాత్రమే తీసుకొన్నారనేది తాజా సమాచారం.

వకీల్ సాబ్ స్క్రిప్టులో మార్పులు
రెండేళ్ల తర్వాత సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకొన్న పవన్ కల్యాణ్ పింక్ రీమేక్‌లో నటించాలని నిర్ణయం తీసుకొన్నారు. హిందీలో విజయం సాధించిన పింక్ చిత్రం ఆధారంగా రూపొందిన వకీల్‌సాబ్ చిత్రంలో నటించారు. అయితే ఇంకా పది నుంచి పదిహేను రోజుల షూటింగు మిగిలి ఉండగా లాక్‌డౌన్ విధించడంతో షూట్ నిలిచిపోయింది. అయితే కథలో కొన్ని మార్పులు, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మళ్లీ జరిపించాలని పవర్ స్టార్ చూపించినట్టు తెలిసింది.

కొత్త స్కిప్టులపై చర్చలు
ఇక లాక్‌డౌన్ సమయంలో కొందరు కథా రచయితలు, దర్శక, నిర్మాతలతో ఆన్‌లైన్‌లో కొన్ని కథలపై చర్చలు జరిపినట్టు తెలిసింది. అలాగే కొన్ని స్క్రిప్టులను పరిశీలించినట్టు సమాచారం. అంతేకాకుండా త్వరలో ప్రారంభించాల్సిన సినిమాల స్క్రిప్టులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి.. కొన్ని మార్పులు కూడా సూచించినట్టు తెలిసింది.

విరూపాక్ష స్క్రిప్టు, డైలాగ్స్ ప్రాక్టిసింగ్ వర్క్
ఇక క్రిష్ జాగర్లమూడి రూపొందించనున్న విరూపాక్ష చిత్రం స్క్రిప్టుపై కూడా కాస్త సమాయాన్ని వెచ్చించినట్టు తెలిసింది. ఆ స్క్రిప్టులోని డైలాగ్స్ పఠనం కూడా చేశారని సన్నిహితులు తెలిపారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న చిత్ర కథను, స్క్రిప్టుపై క్రిష్‌తో కొంత కసరత్తు చేసినట్టు తెలుస్తున్నది.

చాతుర్మాస్య దీక్ష
కరోనా పరిస్తితులతో ఆందోళన చెందిన పవన్ కల్యాణ్.. దేశ ప్రజల క్షేమాన్ని, తెలుగు ప్రజల ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును ఆకాంక్షిస్తూ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. హిందువులకు శుభసూచకమైన తొలి ఏకాదశి రోజున ప్రారంభించి నాలుగు మాసాలపాటు ఈ దీక్షను కొనసాగించునున్నారు. కార్తీక శుక్ల ఏకాదశి రోజున పూర్ణాహుతితో దీక్షను విరమిస్తారు. ఈ దీక్షను దాదాపు రెండు దశాబ్దాలుగా ఆచరిస్తున్నారని సన్నిహితులు పేర్కొన్నారు.
Recommended Video

రాజకీయాలపై చర్చ
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకొన్న తాజా పరిణామాలపై జనసేన అధినేత హోదాలో పవన్ కల్యాణ్ చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. అలాగే కొందరు సామాజిక కార్యకర్తలు, కాపు నేతలతో కూడా ఆన్‌లైన్, ఫోన్‌లో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. రాజకీయంగా కొన్ని సూచనలు, సలహాలను పార్టీ నేతలకు ఇస్తున్నట్టు సమాచారం. ఇలా పవన్ కల్యాణ్ గత 100 రోజులకుపైగా ఇంట్లో కుటుంబ సభ్యులు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని పార్టీ, సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











