టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్: పవన్‌తోపాటు ఆ ఇద్దరి కాంబినేషన్‌లో.. వివరాలు ఇవే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ మూవీలు వస్తున్నాయి. ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల అభిరుచులు మారడంతో హీరోలు ధైర్యం చేయగలుగుతున్నారు. తమ పాత్రలకు ప్రాధాన్యం ఉండేలా కథలు వస్తే మరో హీరోతో కలిసి నటించడానికి ఆలోచించడం లేదు. ఇలాంటి తరుణంలో దర్శకులు కూడా మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్, నాగ చైతన్య, నాని కాంబినేషన్‌లో మూవీ రాబోతుందని ఓ న్యూస్ లీక్ అయింది. ఇందులో త్రివిక్రమ్ కూడా భాగమయ్యాడట. ఆ వివరాలు మీకోసం.!
Recommended Video

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీలు ఇలా.!
టాలీవుడ్‌లో మొదటి తరం హీరోలు మల్టీస్టారర్ మూవీలు చేయడానికి ఆలోచించేవారు కాదు. ఆ తర్వాతి వారు మాత్రం ఈ తరహా సినిమాలు పెద్దగా చేయలేదు. అయితే, ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం ప్రయోగాలు చేయడానికి ఇష్ట పడుతున్నారు. ఈ క్రమంలోనే మరో హీరోతో కలిసి నటిస్తున్నారు. అందుకే గతంతో పోలిస్తే ఇప్పుడు మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి.

వాటి వల్లే మల్టీస్టారర్‌కు పెరిగిన డిమాండ్
పదేళ్ల కాలంలో తెలుగులో చాలా మల్టీస్టారర్ మూవీలు వచ్చాయి. వీటిలో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. మరీ ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', ‘గోపాల గోపాల', ‘F2', ‘వెంకీమామ' వంటివి మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే మిగిలిన హీరోలు సైతం అలాంటి సినిమాలు చేయాలని భావిస్తున్నారు. దర్శకులు కూడా వాటిపై దృష్టి సారిస్తున్నారు.

ఆ సినిమా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో.!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనే భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. అదే.. రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. అలాగే, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య'లో సైతం చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. వీటితో పాటు ‘లూసీఫర్' రీమేక్, ‘మహాసముద్రం', ‘F3 వంటివి పట్టాలెక్కాల్సి ఉంది.

పవన్, చైతన్య, నాని కాంబినేషన్‌లో మూవీ
తెలుగులో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తున్న సమయంలో.. అదే తరహా సినిమా మరొకటి రాబోతుందని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నేచురల్ స్టార్ నాని కలయికలో ఆ మూవీ వస్తుందట. అంతేకాదు, ఇందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా భాగం కాబోతున్నాడని టాక్.

వాళ్లిద్దరే మెయిన్... వీళ్లు మాత్రం వెనకుంటారు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. దీనికి ‘సంతోషం', ‘మిస్టర్ పర్‌ఫెక్ట్' ఫేం దశరథ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను వాల్ పోస్టర్ బ్యానర్‌పై నాని, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై పవర్ స్టార్ కలిసి నిర్మిస్తున్నారని తెలిసింది. అలాగే, త్రివిక్రమ్ కూడా సమర్పకుడిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఆ ఇద్దరు హీరోలు... పవన్ కల్యాణ్, నానినా.?
ఈ సినిమా ముగ్గురు అన్నాదమ్ముల కథతో తెరకెక్కబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. అందులో ఒకరు నాగ చైతన్య కాగా, మరో ఇద్దరు హీరోలు ఫైనల్ కాలేదని అంటున్నారు. మరోవైపు, ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న పవన్, నానినే చైతన్యతో కలిసి నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ రాబోతుందన్న వార్త హాట్ టాపిక్ అవుతోంది.

ఈ హీరోలు ముగ్గురు ఇలా ఫిక్స్ అయ్యారు
క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. ఇదిలాఉండగా... ప్రస్తుతం పవన్ ‘వకీల్ సాబ్', ‘విరూపక్ష'లో నటిస్తున్నాడు. నాని ‘V' విడుదల కావాల్సి ఉండగా, శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్' చేస్తున్నాడు. చైతూ ‘లవ్‌స్టోరీ'తో పాటు రెండు చిత్రాలకు సంతకం చేశాడు.


Click it and Unblock the Notifications











