పవన్ ఫ్యాన్స్‌కు పండుగ ఖాయం: బాలీవుడ్, కోలీవుడ్ హీరోలు కూడా చేయని విధంగా.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాక, దక్షిణాది మొత్తం మెచ్చిన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయినప్పటికీ... ఎంతో శ్రమపడి సొంతంగా ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడాయన. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయిపోయిన ఆయన... కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవన్... త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

ఆఫ్టర్ గ్యాప్... పవర్ స్టార్ ఈజ్ బ్యాక్

ఆఫ్టర్ గ్యాప్... పవర్ స్టార్ ఈజ్ బ్యాక్

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాత‌వాసి' తర్వాత రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ సమయంలో ఇకపై సినిమాలు చేయనని తేల్చి చెప్పాడు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ముఖానికి మేకప్ వేసుకోడానికి సిద్ధం అయ్యాడు ఈ మెగా హీరో.

వకీల్ సాబ్‌గా ఎంట్రీ ఇస్తున్న పవన్

వకీల్ సాబ్‌గా ఎంట్రీ ఇస్తున్న పవన్

‘వకీల్ సాబ్' అనే మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి, అనన్య హీరోయిన్లుగా చేస్తున్న ఈ మూవీలో పవన్ లాయర్‌గా కనిపించనున్నాడు.

భారీ స్పందన.. అంచనాలు రెట్టింపు

భారీ స్పందన.. అంచనాలు రెట్టింపు

పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ‘వకీల్ సాబ్'పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, మగువా మగువా సాంగ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. వీటితో పాటు పవర్ స్టార్ పుట్టినరోజుకు వచ్చిన మోషన్ పోస్టర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

పవన్ సినిమాకు ఊహించని ఆఫర్

పవన్ సినిమాకు ఊహించని ఆఫర్

చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై బయ్యర్లు కూడా బాగా ఫోకస్ చేశారు. అదే సమయంలో ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా ఈ సినిమాను దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరిపినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 80 కోట్లు ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

పవన్ ఫ్యాన్స్‌కు పండుగ ఖాయమే

పవన్ ఫ్యాన్స్‌కు పండుగ ఖాయమే

పవన్ కల్యాణ్ రీఎంట్రీ కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ‘వకీల్ సాబ్' ప్రకటన తర్వాత అందరి దృష్టి ఈ మూవీపైనే ఉంది. దీంతో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది.

Recommended Video

Pawan Kalyan Key Decision On Malayalam Movie Remake
ఆ స్టార్ హీరోలు చేయని విధంగా..

ఆ స్టార్ హీరోలు చేయని విధంగా..

పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ మూవీ బాలీవుడ్‌లో ‘పింక్' అనే పేరుతో, కోలీవుడ్‌లో ‘నెర్కొండ పార్వాయి' అనే టైటిల్‌తో వచ్చాయి. రెండు చోట్లా సూపర్ హిట్ అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. రెండు భాషల్లో చేయని విధంగా ఇందులో హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తున్నారట. పవన్ కోసమే క్రియేట్ చేసిన కొన్ని సీన్స్ సినిమాకు హైలైట్ అవనున్నాయని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X