»   » పవన్ కళ్యాణ్‌కి అమ్మాయి క్లాస్ పీకిన వేళ: ఫస్ట్ లవ్ స్టోరీ హాట్ టాపిక్!

పవన్ కళ్యాణ్‌కి అమ్మాయి క్లాస్ పీకిన వేళ: ఫస్ట్ లవ్ స్టోరీ హాట్ టాపిక్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Pawan Kalyan's Birthday Special : First Love Story Of Pawan Kalyan

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత రేణు దేశాయ్‌తో ప్రేమలో పడటం, ఆ తర్వాత పెళ్లి, విడాకుల సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రష్యన్ మహిళ అన్నా లెజెనివాను వివాహం చేసుకున్నారు. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందు... కాలేజీ రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించిన విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఎవరైనా అమ్మాయి, అబ్బాయి క్లోజ్‌గా ఉంటే చుట్టూ ఉండే ఫ్రెండ్స్ మీరు ప్రేమలో ఉన్నారు అంటూ వారిని కన్‌ఫ్యూజ్ చేస్తారు. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న ఆ జంటలో ప్రేమ భావనలు మొదలవుతాయి. పవన్ కళ్యాణ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

  కంప్యూటర్ క్లాసుకు వెళ్లే రోజుల్లో

  కంప్యూటర్ క్లాసుకు వెళ్లే రోజుల్లో

  పవన్ కళ్యాణ్ మద్రాసులో కంప్యూటర్‌ క్లాసులకు వెళ్తున్న రోజుల్లో ఓ అందమైన అమ్మాయి కంప్యూటర్‌ క్లాసులకు వచ్చేది, పవన్‌తో చాలా క్లోజ్‌గా మాట్లాడేది. వారు చాలా క్లోజ్‌గా ఉంటుండటంతో చుట్టూ ఉండే అతడి స్నేహితులు ‘ఇది ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే కాదు.. ప్రేమ కూడా.. నీ మనసులో మాట చెప్పేయ్‌' అంటూ ఎంకరేజ్ చేసేవారట.

  స్నేహితులు చెప్పడంతో అలా

  స్నేహితులు చెప్పడంతో అలా

  ఆ అమ్మాయిపై పవన్ కళ్యాణ్‌కు ప్రమ భావన లేక పోయినా ఫ్రెండ్స్ చెప్పిన మాటలతో అది ప్రేమే అనుకుని ఆమెకు తన మనసులోని ప్రేమ విషయం చెప్పడానికి సిద్ధమైపోయారట. ఓ రోజు తన ఇంట్లో ఉండే పాత కారు తీసుకుని ఆమెకు ప్రపోజ్ చేయడానికి వెళ్లారట.

  పవన్ కళ్యాణ్‌కు క్లాస్ పీకింది

  పవన్ కళ్యాణ్‌కు క్లాస్ పీకింది

  ఆ అమ్మాయిని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను అంటూ కారులో ఎక్కించుకుని వెళుతుండగా పవన్ కళ్యాణ్ తన మసులోని మాట చెప్పారు. దీనికి ఆమె రియాక్ట్ అవుతూ అసలు ప్రేమంటే ఏమిటనుకున్నావ్‌? ఈ వయసులో ప్రేమేంటి' అంటూ క్లాసు పీకిందట. ‘ఆ సమయంలో ఆ అమ్మాయి మా క్లాస్‌ టీచర్‌లా కనిపించింది. అన్ని క్లాసులు పీకింది. అంటూ పవన్ కళ్యాణ్ గతంలో ఓ సారి గుర్తు చేసుకున్నారు.

  ఇప్పుడు హాట్ టాపిక్

  ఇప్పుడు హాట్ టాపిక్

  పవన్ కళ్యాణ్ జీవితంలో ఎప్పుడో జరిగిన ఈ విషయాలను ఓ పత్రికలో పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా పబ్లిష్ చేయగా.... సోషల్ మీడియాలో మరోసారి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ గురించి హాట్ టాపిక్ అయింది.

  English summary
  Pawan Kalyan’s first love story hot topic in social media. Pawan Kalyan made a few interesting comments about his first love. This story is years before he made his acting debut. “There used to be a famous coaching center in Chennai and I did not think twice before enrolling my name there. One fine day, I met a girl who looked really beautiful and I developed feelings for her. I proposed to her. She kept on speaking about our careers and insisted that this is not the right time to get into relationships, said Pawan, recalling his sweet memories, a few years ago.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more