twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్, రేణుదేశాయ్ ‘జానీ’కి 17 ఏళ్లు.. ఇంద్రను మించిన రికార్డు.. కానీ ఫలితం..

    |

    ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో రూపొందించిన జానీ చిత్రం ఏప్రిల్ 25వ తేదీతో 17 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం అభిమానులను, సగటు సినీ ప్రేక్షకులను, బాక్సాఫీస్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం మాజీ భార్య రేణుదేశాయ్‌తో పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

    Recommended Video

    Johnny Movie Completes 17 Years | Most Craziest Movie Ever
    స్వీయ రచన, దర్శకత్వంలో

    స్వీయ రచన, దర్శకత్వంలో

    పవన్ కల్యాణ్‌ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన చిత్రం జానీ కావడం విశేషం. ఈ సినిమాకు రచయితగా కూడా పవన్ కల్యాణ్ వ్యవహరించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ కిక్ బాక్సర్‌గా నటించిన విషయం తెలిసిందే. క్యాన్సర్ బారిన పడిన భార్యను రక్షించుకొనేందుకు భర్త పడిన కష్టాలు, కిక్ బాక్సర్‌ ప్రొఫెషనల్‌గా సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవచ్చు.

    రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్

    రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్

    జానీ చిత్రం రిలీజ్‌కు ముందు పలు రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్‌లో అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్‌ను కూడా జానీ చేయడం విశేషం. సుమారు 24 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కంటే జానీ చిత్రం ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 250 ప్రింట్లతో రిలీజైన తొలి టాలీవుడ్ మూవీగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.

     హైలెట్‌గా రమణ గోగుల మ్యూజిక్

    హైలెట్‌గా రమణ గోగుల మ్యూజిక్

    జానీ చిత్రంలో హైలెట్‌గా చెప్పుకోవాల్సిన విషయాల్లో రమణ గోగుల అందించిన సంగీతం. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ఆల్బమ్ అత్యధిక అమ్మకాలతో ట్రెండ్ సృష్టించింది. గో జానీ, నారాజ్ గాకుర అన్నయ్య, ఈ రేయి తియనిది, నువ్వు సారా తాగుతా, రావోయి మా ఇంటికి పాటలు ప్రేక్షకులకు కిక్కెక్కించాయి. 6 లక్షలకుపైగా ఆడియో కాసెట్లు అమ్ముడుపోవడం అప్పట్లో రికార్డు.

    ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో

    ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో

    అప్పట్లో ఏ చిత్రానికి రానటువంటి క్రేజ్ జానీ సినిమాకు రిలీజ్‌కు ముందు వచ్చింది. అయితే రిలీజ్ తర్వాత జానీ సినిమా దారుణమైన ప్లాప్‌ టాక్‌ను మూటగట్టుకొంది. అయినా దారుణమైన ఫ్లాప్ సినిమాగా రికార్డు ఎక్కిన జానీ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్క్రీనింగ్ కావడం విశేషం. కొద్ది రోజుల క్రితం బాహుబలికి ఎలాంటి క్రేజ్ కనిపించిందో.. జానీ సినిమా రిలీజ్‌కు ముందు కూడా అలాంటి పరిస్థితే ఉండేదని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

     తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: పవన్ కల్యాణ్, రేణుదేశాయ్, గీతా, రఘువరన్, రజా మురాద్, బ్రహ్మాజీ, మల్లికార్జున్ రావు, ఎంఎస్ నారాయణ తదితరులు
    దర్శకత్వం, రచన, స్క్రీన్ ప్లే, స్టోరి: పవన్ కల్యాణ్
    నిర్మాత: అల్లు అరవింద్
    సంగీతం: రమణ గోగుల
    సినిమాటోగ్రఫి: చోటా కే నాయుడు, శ్యామ్ పలావ్
    ఎడిటింగ్: యూసఫ్ ఖాన్
    రిలీజ్: 25 ఏప్రిల్, 2003
    నిడివి: 178 నిమిషాలు

    English summary
    Johnny film written and directed by Pawan Kalyan which is Produced by Allu Aravind. The film starred Pawan Kalyan in the titular role, while Renu Desai, Raghuvaran, and Raza Murad played pivotal roles. This movie released on 25th April, 2003 and ended with biggest flop in tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X