ఎయిర్ పోర్టులో పవన్ కళ్యాణ్‌ని చూసి షాకైన జనం.. పవన్‌లో ఇంత మార్పా!

Recommended Video

Pawan Kalyan’s New-Look After A Long Time || Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తాజా లుక్ తెలుగు ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఇన్నాళ్లు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మద్యే కాస్త రిలాక్స్ అవుతున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆయన రాజకీయాలు వదిలేదే లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి జనంలోకి వస్తున్నారు పవన్ కళ్యాణ్. కాకపోతే ఇదివరకటి లుక్‌లో కాకుండా కొత్త లుక్‌లో ఆయన కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ఎయిర్ పోర్టులో పవన్ కళ్యాణ్‌.. జనం షాక్

ఎయిర్ పోర్టులో పవన్ కళ్యాణ్‌.. జనం షాక్

మొన్నటిదాకా గడ్డం, తెల్ల చొక్కాతో అచ్చమైన పొలిటిషన్ లా కనిపించిన పవన్ కళ్యాణ్.. తాజాగా జీన్స్, టీ షర్ట్ ధరించి మోడ్రెన్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ లుక్ లో పవన్‌ని చూసి ఆశ్చర్యపోయిన పబ్లిక్.. మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాడా? ఏంటి? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో తానాలో జరిగే మహాసభల కోసం వెళుతున్న పవన్.. ఎయిర్ పోర్ట్‌లో ఇలా కనిపించారు.

పవన్‌తో పాటు పలువురు ప్రముఖులు

పవన్‌తో పాటు పలువురు ప్రముఖులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహా సభలు జులై 4 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్‌ డీసీ లో జరగనున్నాయి. ఈ సభలకు పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు సినీ ప్రమఖులు హాజరై సందడి చేయబోతున్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి, తమన్, పూజా హెగ్డే తానా సభల్లో మెరవనున్నారు.

జనసేనాని స్పీచ్‌పై ఉత్కంఠ

జనసేనాని స్పీచ్‌పై ఉత్కంఠ

తానా మహా సభలకు ముఖ్య అతిధిగా హాజరవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ సభా ప్రాంగణంలో ఇచ్చే స్పీచ్ ఎలా ఉంటుందనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ స్పీచ్ పై అక్కడి తెలుగు ప్రజల ఆసక్తి ఎలా ఉంటుంది? పవన్ ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అనేది జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

పవన్‌లో ఇంత మార్పా?

పవన్‌లో ఇంత మార్పా?

పవన్ రూపంలో ఇంత మార్పు రావడం జనాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయ కార్యక్రమాలు ఫినిష్ అయ్యాయి కాబట్టి పవన్ తన రెగ్యులర్ గెటప్ లోకి వచ్చేశారు. కానీ ఈ అట్రాక్టివ్ లుక్‌లో పవన్‌ని చూసిన ఆయన అభిమానులు తిరిగి సినిమాలు చేయాలని కోరుతున్నారు. పరిస్థితులను బట్టి పవన్‌ రూపంలో మార్పు రావడాన్ని జనం స్వాగతిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X