Just In
- 3 hrs ago
ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి
- 4 hrs ago
బిగ్‌బాస్ సీజన్ 5లో శ్రీరెడ్డి.. కంటెస్టెంట్లకు భారీగా ఆఫర్లు.. శరవేగంగా ఏర్పాట్లు..
- 4 hrs ago
రొమాంటిక్ లుక్స్‌తో అదరగొట్టిన పూర్ణ.. వైరల్‌గా బ్యాక్‌డోర్ టీజర్
- 4 hrs ago
పొట్టి బట్టల్లో ఫిదా చేసింది.. లావణ్య త్రిపాఠిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!
Don't Miss!
- News
తెలంగాణ విద్యుత్ సర్వర్లపై చైనా హ్యాకర్లు దాడికి యత్నం: అలర్ట్‌గా ఉన్నామన్న ట్రాన్స్‌స్కో సీఎండీ
- Finance
బంగారం ధర రూ.50,000కు చేరుకునే ఛాన్స్! రూ.45,500 వద్దనే ధరలు
- Sports
ఇంగ్లండ్‌లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి.. పిచ్‌పై ఫిర్యాదు చేయడానికి ఏంలేదు: ఆర్చర్
- Lifestyle
లైంగిక సంపర్కం సమయంలో మహిళలు చేసే ఈ పనులు పురుషులను ఉద్వేగానికి గురి చేస్తుంది!
- Automobiles
2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
17వ శతాబ్దంలోకి పవన్ కల్యాణ్.. దిమ్మతిరిగేలా డైరెక్టర్ క్రిష్ స్పెషల్ ప్లానింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. మూడేళ్త గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే మరో రెండు, మూడు సినిమాలతో బిజీగా మారనున్నారు. అయితే తాజాగా డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న మూవీకి సంబంధించి ఫ్యాన్స్‌కు ఉత్సాహం కలిగించే ఆసక్తికరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే...

వరుస సినిమాలతో పవర్ స్టార్
గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ టాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికల ముగిసిన తర్వాత ముందస్తు ఒప్పందం ప్రకారం కొన్ని సినిమాలు పలువురు నిర్మాతలకు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే వకీల్ సాబ్, మైత్రీ మూవీస్, ఏఎం రత్నం లాంటి నిర్మాతలకు సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు.

పింక్ రీమేక్‌తో రీ ఎంట్రీ
ఇక అనుకోకుండా పవన్ కల్యాణ్ ముందుకు వచ్చిన పింక్ రీమేక్‌ను కూడా ఒప్పుకొన్నారు. బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో నటించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. వేసవిలో వకీల్ సాబ్‌ను థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌లో
ఇదిలా ఉండగానే, పవన్ కల్యాణ్ వేగంగా మరో సినిమాను పట్టాలెక్కించారు. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌లో రానాతో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమా షూటింగ్‌ను కొనసాగిస్తూనే క్రిష్ దర్శకత్వంలో రూపొందే సినిమాకు ప్రిపేర్ అవుతున్నారు.

17వ శతాబ్దానికి సంబంధించిన సెట్
క్రిష్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా #PSKP27 అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనలు హైదరాబాద్‌లో వేగంగా జరుగుతున్నాయి. 17వ శతాబ్దానికి సంబంధించిన భవనాల సెట్లను వేస్తున్నారు. ఈ సెట్‌లో పవన్‌పై భారీ ఎత్తున యాక్షన్ సీన్లు చిత్రీకరించేందుకు క్రిష్ ప్లాన్ చేశారు.

త్వరలోనే PSKP27 షూటింగుకు పవన్ కల్యాణ్
#PSKP27 మూవీకి సంబంధించిన పనులపై క్రిష్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా సెట్‌లో జరుగుతున్న విషయాలను గమనిస్తూ తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్వరలోనే పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగుకు హాజరుకానున్నారు.