Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ‘వకీల్ సాబ్’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్
సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'అజ్ఞాతవాసి' తర్వాత గ్యాప్ తీసుకున్న అతడు.. ఇప్పుడు 'వకీల్ సాబ్' అనే మూవీతో కమ్‌బ్యాక్ అవుతున్నాడు. బాలీవుడ్ మూవీ 'పింక్'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం చాలా కాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్నాడు పవన్. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ వచ్చిన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'వకీల్ సాబ్' నుంచి మెగా అభిమానులను అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ డబ్బింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. శుక్రవారం బ్యాలెన్స్ ఉన్న భాగాన్ని పవన్ కల్యాణ్ పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే మిగిలిన కార్యక్రమాలను అన్నింటినీ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు డబ్బింగ్ పార్టును కూడా ముగించడంతో విడుదలకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మురం చేయనున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'వకీల్ సాబ్'లో వ్యభిచార గృహంలో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే లాయర్‌గా పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. హిందీలో ఈ పాత్రను అమితాబ్ బచ్చన్, తమిళంలో అజిత్ కుమార్ చేశారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్యలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ బిజినెస్ దాదాపు రూ. 100 కోట్లకు పైగానే జరిగిందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను ఉగాది కానుకగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.