For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నితిన్ కోసం రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్: శిష్యుడి కోసం ఏ హీరో చేయని త్యాగం.. దటీజ్ పవర్ స్టార్!

  |

  టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో చిత్రాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'భీష్మ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. అయితే, ఈ ఏడాది మాత్రం ఇప్పటికే రెండు పరాజయాలను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో నితిన్ కోసం ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాడు. అంతేకాదు, ఏ హీరో చేయని త్యాగం చేశాడు. ఈ హీరోలిద్దరి మధ్య అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  ఇప్పటికే రెండు ఫ్లాపులతో సతమతం

  ఇప్పటికే రెండు ఫ్లాపులతో సతమతం

  గత ఏడాది ‘భీష్మ'తో భారీ హిట్‌ను అందుకున్న నితిన్.. ఈ సంవత్సరం అప్పుడే రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి చంద్రశేఖర్ ఏలేటీ తెరకెక్కించిన ‘చెక్' కాగా.. రెండోది వెంకీ అట్లూరి తీసిన ‘రంగ్ దే'. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాలను చవి చూశాయి. దీంతో ఈ యంగ్ హీరో నిరాశగా ఉన్నాడు. అతడి అభిమానులు కూడా ఢీలా పడిపోయారు.

  ‘మాస్ట్రో' అంటూ వస్తోన్న యూత్ స్టార్

  ‘మాస్ట్రో' అంటూ వస్తోన్న యూత్ స్టార్

  ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ‘మాస్ట్రో' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రం ‘అంధాధున్'కు రీమేక్‌గా వస్తోంది. ఇందులో నభా నటేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. త్వరలోనే ఈ ప్రకటన వెలువడబోతుందని టాక్.

  వక్కంతం వంశీతో సినిమాకు సిగ్నల్

  వక్కంతం వంశీతో సినిమాకు సిగ్నల్

  ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న యూత్ స్టార్ నితిన్.. ప్రముఖ రచయిత, ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రకటన కూడా రాబోతుందట.

  తొలిసారి అలాంటి పాత్రలో యంగ్ హీరో

  తొలిసారి అలాంటి పాత్రలో యంగ్ హీరో

  వక్కంతం వంశీ తెరకెక్కించే ఈ సినిమా గురించి అప్పుడే ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలో నితిన్ పోలీస్ పాత్రను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. ఆ తర్వాత ఇందులో అతడు రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నాడు. అందులో ఒక దానికి విచిత్రమైన మేకోవర్‌తో కనిపించబోతున్నాడని తెలిసింది. అది కెరీర్‌లోనే చాలెంజింగ్ రోల్ అని టాక్.

  నితిన్ కోసం రంగంలోకి దిగిన పవన్

  నితిన్ కోసం రంగంలోకి దిగిన పవన్

  యంగ్ హీరో నితిన్.. వక్కంతం వంశీ మధ్య ప్రాజెక్టు ఓకే అవడానికి బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణే కారణం అని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచార ప్రకారం.. వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న నితిన్‌కు హిట్ అందించాలన్న ఉద్దేశంతో వక్కంతం వంశీని అతడి దగ్గరకు పంపించింది పవనే అని తెలిసింది.

  శిష్యుడి కోసం ఏ హీరో చేయని త్యాగం

  శిష్యుడి కోసం ఏ హీరో చేయని త్యాగం

  ఇటీవల పవన్‌కు వక్కంతం వంశీ ఓ కథను వినిపించాడట. ఇది అతడికి బాగా నచ్చడంతో వరుస ఫ్లాపులతో బాధ పడుతోన్న నితిన్‌తో ఈ సినిమా చేయమని సదరు దర్శకుడికి పవర్ స్టార్ సలహా ఇచ్చాడట. అందుకు అనుగుణంగానే వంశీ.. నితిన్‌ను సంప్రదించడంతో ఈ ప్రాజెక్టు ఓకే అయిందని తెలుస్తోంది. తనను అభిమానించే హీరో కోసం కథను ఇచ్చిన పవన్‌పై ప్రశంసల వర్షం కురిస్తోంది.

  English summary
  Tollywood Youth Star Nithiin Likes Pawan Kalyan Very Much. Recently This Star Hero Listened a Script by Vakkantham Vamsi. Now Power Star Gave This Story to Nithiin.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X