వైరల్‌గా రవిప్రకాశ్‌పై పవన్ కల్యాణ్ సెటైర్... రియల్ అజ్ఞాతవాసి అంటూ మళ్లీ..
మీడియా దిగ్గజం, టీవీ9 అధినేత రవి ప్రకాశ్‌ను తొలగించారనే వార్త ప్రాంతీయ మీడియాలోనే కాదు.. జాతీయ మీడియాలోనూ రోజంతా చర్చ జరిగింది. 8 శాతం వాటా ఉన్న రవి ప్రకాశ్‌పై ప్రస్తుత యాజమాన్యం వేటు వేసిందనే వార్త సంచలనం రేపింది. రవి ప్రకాశ్ తొలగింపు అంశం సోషల్ మీడియాలో కాకపుట్టించింది. సానుకూల, ప్రతికూల అంశాలతో అట్టుడికిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ స్పందించడం మరింత సెన్సేషనల్‌గా మారింది. ఈ నేపథ్యంలో గతంలో రవి ప్రకాశ్‌ను ఎద్దేవా చేస్తూ పవర్ స్టార్ చేసిన ట్వీట్ మళ్లీ వెలుగులోకి వచ్చింది.

నటి శ్రీరెడ్డి వివాదం నేపథ్యంలో
గతంలో శ్రీరెడ్డి వివాదం నేపథ్యంలో పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా, తన కుటుంబానికి వ్యతిరేకంగా వార్తా కథానాలు మీడియాలో రావడంపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్స్‌పై సోషల్ మీడియాలో ఓ వార్ ప్రకటించినంత పనిచేశారు. ఘాటైన పోస్టులు, ఫోటోలతో రచ్చ చేశారు. ఆ తర్వాత టీవీ9, ఏబీఎన్ ఛానెల్స్ కథనాల తీవ్రత తగ్గడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

పవన్ కల్యాణ్ సెటైర్ ట్వీట్
అప్పట్లో రవి ప్రకాశ్‌పై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. రవిప్రకాశ్‌ను ఉద్దేశించి.. ‘రవి నిన్ను రియల్ అజ్ఞాతవాసి అని ఎందుకు అన్నానో ఇప్పుడైనా తెలిసిందా?' అప్పుడో.. ఇప్పుడో గుర్తించావా? అంటూ ట్వీట్ చేశారు. పవన్ ట్వీట్ చేసిన వెంటనే ర్వీట్వీట్లతో మార్మోగింది. పవర్ ఫ్యాన్స్ యాక్టివ్ అయ్యారు. పవన్ చేసిన ట్వీట్‌ను వెలుగులోకి తెచ్చి రీట్వీట్లు, కామెంట్లతో దడదడలాడిస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌తో రచ్చ
‘టీవీ9 నుంచి తొలగించడంతో పొద్దున నుంచి గిలగిలా కొట్టేసుకొంటున్నారు. రియల్ అజ్ఞాతవాసి రవిప్రకాశ్ గారు. నువ్వు ప్రశ్నలు వేసి విసిగించకు', ‘నువ్వు అప్పుడే చెప్పావ్ అన్నా.. ఎవరు వినలేదు', ‘తప్పుడు వెధవలకు తల్చుకోవాలంటేనే తడిసిపోయేలా తరిమి తరిమి కొడుతున్నావు కదన్నా.. తగ్గే సమస్యే లేదనలా..' అంటూ కామెంట్లతో దడడదలాడించారు.

రవిప్రకాశ్ ధీటైన జవాబు
ఇది ఇలా ఉండగా, రోజంతా మీడియా సెన్సేషనల్ బ్రేకింగ్ తర్వాత సాయంత్రం రవి ప్రకాశ్ స్పందించారు. ఏకంగా టీవీ9 ఛానెల్‌లో లైవ్‌లోకి వచ్చి తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారం. అవాస్తవాలు ఎప్పటికీ నిలబడలేవు. మీడియా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా నాపై వ్యతిరేక వార్తలు ప్రచారం చేసిందుకు ధన్యవాదాలు అంటూ చురకలు అంటించారు.


Click it and Unblock the Notifications











