‘వకీల్ సాబ్’ మూవీలో అదొక్కటే మైనస్: ఆ ఎపిసోడ్‌పై బ్యాడ్ కామెంట్స్.. అది కలపకపోయి ఉంటే ఓ రేంజ్‌లో!

వకీల్ సాబ్.. వకీల్ సాబ్.. వకీల్ సాబ్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరు ఇది. దీని వెనుక కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ సినిమా ద్వారానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ముందు నుంచే విడుదలకు ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక, ఎన్నో అంచనాల నడుమ 'వకీల్ సాబ్' మూవీ ఈరోజు విడుదలైంది. దీనికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఓ అంశం మైనస్‌గా మారింది. ఆ వివరాలు మీకోసం!

పవన్ కల్యాణ్ రీఎంట్రీ.. ‘వకీల్ సాబ్'గా మారి

పవన్ కల్యాణ్ రీఎంట్రీ.. ‘వకీల్ సాబ్'గా మారి

రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు.

గ్రాండ్‌గా రిలీజ్.. ఫస్ట్ అక్కడ... తర్వాత ఇలా

గ్రాండ్‌గా రిలీజ్.. ఫస్ట్ అక్కడ... తర్వాత ఇలా

ముందుగా ప్రకటించినట్లుగానే 'వకీల్ సాబ్' చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే, యూఎస్ సహా విదేశాల్లో మనకంటే ముందుగానే ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్పెషల్, బెనిఫిట్ షోలు పడలేదు. కానీ, తెలంగాణలో ప్రదర్శితం అయ్యాయి. ఇక, 11 గంటల నుంచి పూర్తి స్థాయిలో రిలీజ్ అయింది.

అన్ని చోట్లా పాజిటివ్ టాక్.. పర్‌ఫెక్ట్ కంబ్యాక్

అన్ని చోట్లా పాజిటివ్ టాక్.. పర్‌ఫెక్ట్ కంబ్యాక్

'వకీల్ సాబ్' మూవీ నైజాంలో 354, సీడెడ్‌లో 220, ఆంధ్రాలో 600, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 300, ఓవర్సీస్‌లో 700లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 2174 థియేటర్లలో విడుదల అయింది. మరికొన్ని చోట్లా ఇది స్పెషల్‌గా వేశారు. ఇక, అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు.

అతడికి ఎక్కువ మార్కులు.. అంతా అదుర్స్

అతడికి ఎక్కువ మార్కులు.. అంతా అదుర్స్

'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. అంతలా అతడు ఈ చిత్రానికి ప్రాణం పోశాడు. మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. ఇక, దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చక్కని ప్రతిభను కనబరిచాడు. హీరోయిన్లు అంజలి, నివేదా, అనన్య పోటీ పడి నటించారు. ప్రకాశ్ రాజ్ ఎప్పటిలాగే మెప్పించాడు.

‘వకీల్ సాబ్' సినిమాలో అదొక్కటే మైనస్ అని

‘వకీల్ సాబ్' సినిమాలో అదొక్కటే మైనస్ అని

దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను రూపొందించారు. మరీ ముఖ్యంగా రెండు భాషల్లో లేని విధంగా ఇందులో హీరోయిన్‌ను పెట్టడంతో పాటు లవ్ ట్రాక్‌ను కూడా జోడించారు. ఇప్పుడిదే సినిమాకు మైనస్ అయిందన్న కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి.

Recommended Video

Valasa Movie Teaser | Manoj Nandam, Vinay Mahdev | Sunil Kumar Reddy
ఆ ఎపిసోడ్‌పై బ్యాడ్ కామెంట్స్.. లేకుంటే ప్లస్

ఆ ఎపిసోడ్‌పై బ్యాడ్ కామెంట్స్.. లేకుంటే ప్లస్

'వకీల్ సాబ్' మూవీ రివ్యూలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అన్నింట్లోనూ పవన్ కల్యాణ్ - శృతి హాసన్ ట్రాకును హైలైట్ చేస్తున్నారు. స్పీడుగా సాగే సినిమాకు బ్రేకర్‌లా మారిందని పెదవి విరుస్తున్నారు. బలమైన సన్నివేశాలు లేకుండానే సోసోగా నడిపించారని అంటున్నారు. అది కూడా ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఓ రేంజ్‌లో వెళ్లిపోయేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X