Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
పవన్ తనయుల డామినేషన్.. చిన్నోడు, పెద్దోడు చితకొట్టేస్తున్నారుగా!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి సెలబ్రేటీలకు సైతం ఒక అవగాహన ఉంది. అగ్ర దర్శకులతో పాటు స్టార్ హీరోలు కూడా టాలీవుడ్ అనగానే పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తాడని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకు సంబంధించిన చిన్న ఫొటో విడుదలైనా కూడా సోషల్ మిడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇటీవల ఆయన తనయులు డామినేట్ చేశారనే చెప్పాలి.
ఫ్యామిలీతో పవన్..
పవన్ కళ్యాణ్ ఎక్కువగా రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీకి ఎదో ఒక విదంగా దగ్గరవుతూనే ఉంటాడు. అటువైపు పెద్ద కుమారుడు కూతుర్ని ఇటువైపు చిన్న కుమారుడు కూతురితో సమానంగా టైమ్ స్పెండ్ చేస్తూ తన తండ్రి బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. మొన్న అకిరా, ఆధ్యలతో దిగిన ఫొటో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఆ పెళ్లిలో అకిరా.. స్పెషల్ ఎట్రాక్షన్ గా..
ఇక ఆ తరువాత నిహారిక పెళ్లి వేడుక హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. వేడుకకు మెగా ఫ్యామిలీకి చెందిన వారందరు వచ్చేశారు. దాదాపు 150 మందికి పైగా వేడుకలో మూడు రోజుల పాటు పాల్గొన్నారు. ఇక ఆ వేడుకలో పవన్ తనయుడు అకిరా నందన్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అందరికంటే ఎక్కువ హైట్ తో కనిపించడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు.
చిన్నోడు కూడా డామినేట్ చేశాడు
సోషల్ మీడియాలో ఇటీవల అకిరాకు సంబంధించిన ఫొటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇక నిన్నటి నుంచి పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ డామినేషన్ మొదలైంది. చిన్నోడు అమ్మతో ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఒక్కసారిగా కెమెరాలన్ని అతని వైపు తిరిగాయి. ఇక ఫొటోలు అలా సోషల్ మీడియాలో లీక్ అవ్వగానే ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి.
ఇప్పుడే ఇలా ఉన్నారంటే..
మొన్న పెద్దోడు అకిరా నందన్ సోషల్ మీడియాలో హవా కొనసాగిస్తే ఇప్పుడు చిన్నోడు మార్క్ శంకర్ పవనోవిచ్ తన పంజాను చూపించాడు. పవన్ తనయులకు ఇప్పుడే ఈ రేంజ్ లో క్రేజ్ ఉందంటే ఇక రానున్న రోజుల్లో ఇంకా ఏ స్థాయిలో బజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అకిరా వయసు ఇప్పటికే 16ఏళ్ళు త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడాని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.