వైసీపీ నేతతో పవన్ భారీ డీల్: రాజకీయ వైరానికి ఇలా ముగింపు పలుకుతున్నారు.!

By Manoj

టాలీవుడ్‌లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు... మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అన్న ట్యాగ్‌ను త్వరగానే మరిపించాడు. ప్రత్యేకమైన స్టైల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువై తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోగా పేరొందాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన హవాను చూపిస్తున్నాడు. ఇక, రాజకీయాల నుంచి వచ్చిన తర్వాత వైసీపీ నేతతో పవన్ కల్యాణ్ భారీ ఢీల్ కుదుర్చుకున్నాడని ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

‘వకీల్ సాబ్’గా ఎంట్రీ ఇస్తున్న పవన్

‘వకీల్ సాబ్’గా ఎంట్రీ ఇస్తున్న పవన్

ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్.. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ‘వకీల్ సాబ్' అనే సినిమాతో సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్'కు ఇది రీమేక్. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీలోని పాటకు విశేష స్పందన వచ్చింది.

మరో ఇద్దరిని ఫైనల్ చేసిన పవర్ స్టార్

మరో ఇద్దరిని ఫైనల్ చేసిన పవర్ స్టార్


రీఎంట్రీలో స్పీడు పెంచేశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే ‘వకీల్ సాబ్' సినిమా షూటింగ్‌లో పాల్గొంటోన్న ఆయన... ఇది పూర్తవకుండానే మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వాటిలో ఒకటి ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న సినిమా కాగా, రెండోది మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీశ్ శంకర్ తీయబోయే సినిమా.

ఆదిలోనే షాక్.. పవన్ ప్లాన్ ఫెయిల్

ఆదిలోనే షాక్.. పవన్ ప్లాన్ ఫెయిల్

వరుసగా సినిమాలు ఒప్పుకుని.. వీలైనంత తర్వాత వాటిని పూర్తి చేయాలని భావించాడు పవన్ కల్యాణ్. అయితే, కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో మే 15న విడుదల కావాల్సిన ‘వకీల్ సాబ్' వాయిదా పడిపోయింది. దీనితో పాటే ఆ తర్వాత చేయాల్సిన ప్రాజెక్టులన్నీ మరింత ఆలస్యం కానున్నాయి. దీంతో పవన్ వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయింది.

మూడే కాదు.. లాక్‌డౌన్‌లో చర్చలు

మూడే కాదు.. లాక్‌డౌన్‌లో చర్చలు

ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఓకే చేసిన సినిమాలు మూడే. అయితే, వాటితో పాటు ఆయన మరికొన్ని చిత్రాలు చేయడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌లో కొందరు దర్శకులతో కథా చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆయన భవిష్యత్‌లో డాలీ, బాబీ, త్రివిక్రమ్‌లతోనూ సినిమాలు చేయనున్నట్లు సమాచారం.

వైసీపీ నేతతో పవన్ కల్యాణ్ భారీ డీల్

వైసీపీ నేతతో పవన్ కల్యాణ్ భారీ డీల్

తన చేతిలో ఉన్న తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు పవన్ కల్యాణ్. అందుకోసమే సమయాన్ని వృథా చేయకుండా ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం కేటాయిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్నింటిని లైన్‌లో పెట్టేశాడు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేతతో పవన్ భారీ డీల్ కుదుర్చుకున్నాడని ఓ న్యూస్ లీకైంది.

రాజకీయ వైరానికి ఇలా ముగింపు

రాజకీయ వైరానికి ఇలా ముగింపు

పవన్ కల్యాణ్ డీల్ కుదుర్చుకున్నాడని ప్రచారం జరుగుతోన్న వ్యక్తి ఎవరో కాదు... వైసీపీ లీడర్ కమ్ ప్రొడ్యూసర్ ప్రసాద్‌ వీ పొట్లూరి. భారీ చిత్రాల నిర్మాతగా పేరొందిన ఆయన త్వరలోనే పవర్ స్టార్‌తో సినిమా చేయబోతున్నారని ఓ న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అందుకోసం ఇప్పటికే పవన్‌తో ఆయన భారీ డీల్ కుదుర్చుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Shruti Haasan Demands Huge Remuneration For Pawan Kalyan's Movie
వ్యాపారాలు.. సినిమాలు.. పాలిటిక్స్

వ్యాపారాలు.. సినిమాలు.. పాలిటిక్స్

వ్యాపారవేత్తగా పేరొందిన ప్రసాద్‌ వీ పొట్లూరి ‘బలుపు' అనే సినిమాతో టాలీవుడ్‌కు ప్రొడ్యూసర్‌గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ.. పార్టీలోని నాయకుడిగా క్రియాశీలకంగా పని చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X