మెట్రోలో వకీల్ సాబ్.. రైతులతో పవన్ కళ్యాణ్ ముచ్చట్లు.. పిక్స్ వైరల్

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్‌లొ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత మేకప్ వేసుకుని సెట్‌లోకి వచ్చాడు. ఇంత వరకు ఓ సాధువులా గడ్డం, జుట్టు పెంచిన పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్ చేసుకుని అభిమానులకు సూపర్ కిక్కిచ్చాడు. ఒకప్పటి పవన్ కళ్యాణ్‌ను చూడటంతో ఫ్యాన్స్ అందరూ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం శర వేగంగా జరుపుకుంటోన్న వకీల్ సాబ్ మూవీ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ మెట్రోలో ప్రయణించాడు.

మెట్రోలో వకీల్ సాబ్

మెట్రోలో వకీల్ సాబ్

నేడు (నవంబర్ 5) ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశాడు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించాడు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లాడు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్‌లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించాడు. ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారాడు. ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో సంభాషించాడు.

రైతుతో ముచ్చట్లు

రైతుతో ముచ్చట్లు

మియాపూర్ వెళ్లే దారిలో పవన్ కళ్యాణ్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. ద్రాక్షారామం చెందిన శ్రీ చిన సత్యనారాయణ అనే రైతుతో మాట్లాడాడు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు. శ్రీ చిన సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవలి వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతింది అని చెప్పాడు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది మీ అభిమానులు ఉన్నారని ఆ రైతు చెప్పాడు.

నాక్కూడా కొత్తే..

నాక్కూడా కొత్తే..

ఈ ప్రయాణంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని ఆ రైతు ఆనందం వ్యక్తం చేశాడు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నాడు. ఇలా మొత్తానికి పవన్ కళ్యాణ్ మెట్రోలో ప్రయాణించడంతో అక్కడ అంతా సందడి వాతావరణం నెలకొంది.

నిన్న అలా..

నిన్న అలా..


వకీల్ సాబ్ లుక్‌లో పవన్ కళ్యాణ్ రోజూ దర్శనమిస్తున్నాడు. మొన్న ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. నిన్న బొమ్మ అదిరింది టీంతో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. శ్రీముఖి, జానీ మాస్టర్, రియాజ్‌లు పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. నేడు ఈ మెట్రో ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రయాణంలో దిల్ రాజు పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X