పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్న ఏప్రిల్.. ఓ వైపు డిజాస్టర్స్ మరోవైపు ఇండస్ట్రీ హిట్స్

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కంటెంట్ కంటే కూడా ముహూర్తాలను సెంటిమెంట్స్ ను తప్పనిసరిగా పాటించడం రొటీన్ అయినా తప్పని ఆచారం. అయితే పవన్ కళ్యాణ్ వాకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ లో రానున్న విషయం తెలిసిందే అయితే ఓ వర్గం ఆడియెన్స్ లో సినిమా విడుదల తేది కన్ఫ్యూజన్ లో పడేసి కలవర పెడుతోంది.

Recommended Video

Vakeel Saab : April Sentiment ,Boon Or Bane For Pawan Kalyan ?
 చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా

చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా

చాలా గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో వస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సినిమా ఏప్రిల్ 9న విడుదల కానున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

సగం డిజాస్టర్స్.. సగం ఇండస్ట్రీ హిట్స్

సగం డిజాస్టర్స్.. సగం ఇండస్ట్రీ హిట్స్

అంతా బాగానే ఉంది గాని ఏప్రిల్ నెల అనగానే ఒక సెంటిమెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆ నెలలో పవన్ విడుదల చేసిన సినిమాల్లో సగం డిజాస్టర్స్ కాగా మరో సగం ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ పై ప్లాప్స్ ఏనాడు కూడా ప్రభావం చూపలేదని అందరికి తెలిసిన వాస్తవమే. అయితే వకీల్ సాబ్ విషయంలో మాత్రం అలా కాకూడదని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.

బద్రి.. జానీ..

బద్రి.. జానీ..

పవన్ కళ్యాణ్ ఏప్రిల్ మ్యాటర్ లోకి వెళితే.. మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన బద్రి సినిమా ఏప్రిల్ 20న వచ్చింది. ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అదే నెలలో ఒకసారి జానీ సినిమాను విడుదల చేయగా అది డిజాస్టర్ అయ్యింది.

ఇండస్ట్రీ హిట్ కొట్టి..

ఇండస్ట్రీ హిట్ కొట్టి..

ఖుషి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా వచ్చింది ఏప్రిల్ 26న. ఇక తీన్ మార్ సినిమా ఏప్రిల్ 14న వచ్చింది. ఆ సినిమా మరో బిగ్గెస్ట్ డిజాస్టర్. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా జల్సా ఏప్రిల్ 2న వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8న వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా యవారేజ్ కెలెక్షన్స్ అందుకుంది.

ఈసారి ఏం జరుగుతుందో

ఈసారి ఏం జరుగుతుందో

ఏప్రిల్ నెల అనేది పవన్ కళ్యాణ్ కెరీర్ లో స్పెషల్ అని చెప్పవచ్చు. హిట్స్ తో పాటు బిగెస్ట్ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు 7వ సారి వకీల్ సాబ్ సినిమాతో అదే నెలలో రాబోతున్నాడు. కబాట్టి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. చిత్ర యూనిట్ అయితే సినిమా రిజల్ట్ పై పూర్తి నమ్మకంతో ఉంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X