పవన్ vs మహేష్ సంక్రాంతి ఫైట్: బాక్సాఫీస్ వద్ద లాభాలు రావాలంటే.. మాట్లాడుకోవాల్సిందే!

ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశారు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరు అగ్ర హీరోలు బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి దిగారు. ఈ జనరేషన్ లో టాలీవుడ్ లో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బిగెస్ట్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..అలాంటిది ఇద్దరు ఒకేసారి పోటీకి దిగితే వాతావరణం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఫైట్ కంటే ముందు ఇద్దరు సినిమాల నిర్మాతలు ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాల్సిందే అనే టాక్ మొదలైంది. హీరోలు ఆ చర్చల్లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ముందే క్లారిటీ ఇచ్చిన మహేష్

ముందే క్లారిటీ ఇచ్చిన మహేష్

మహేష్ బాబు సర్కారు వారి పాటపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక పిరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు. 17వ శతాబ్దంలోని కొన్ని హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. హరహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

 లాభాలు అందుకోవాలి అంటే..

లాభాలు అందుకోవాలి అంటే..

అయితే ఈ రెండు సినిమాలో సంక్రాంతి సీజన్ కు రావడం మంచిదే అయినా ముందుగా ఎవరు ఏ డేట్ కు వస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ఒకే రోజు అయితే రారు. ఇక కంటెంట్ బావుంటే ఎప్పుడైనా రవచ్చు గాని బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలు అందుకోవాలి అంటే మాత్రం సరైన డేట్ ను సెలెక్ట్ చేసుకోక తప్పదు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 జనవరి 12.. ఇంపార్టెంట్ డేట్

జనవరి 12.. ఇంపార్టెంట్ డేట్

ఇక ఎక్కువగా జనవరి 12 కీలకం కానుంది. ఈ తేదీన వచ్చిన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు అందడం కాయం. జనవరి 12 బుధవారం. ఇక దాని ముందు రోజు అంటే మంగళవారం.. యూఎస్ లోనే ప్రీమియర్స్ ద్వారా భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడం సహజం. ఇక బుధవారం ఫస్ట్ డే కాబట్టి హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో థియేటర్స్ నిండిపోతాయి. గురువారం భోగి, శుక్రవారం సంక్రాంతి కావున పండగ సీజన్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ సందడి ఎక్కువగా ఉంటుంది.

 అప్పుడు వస్తే లాభాలే..

అప్పుడు వస్తే లాభాలే..

శని,ఆది వారాలు కలెక్షన్స్ ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందుకే జనవరి 12న విడుదలైన. సినిమాకు ఫస్ట్ వీకెండ్ లోపే పెట్టిన పెట్టుబడులు వెనక్కి వచ్చేస్తాయి. కాబట్టి ఆ డేట్ కోసం రెండు సినిమాల మధ్య పోటీ నడవడం కాయం. దీంతో నిర్మాతలు కలిసి సెటిల్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X