పవన్ భార్యతో కలిసి అకీరా సంబరం.. జనసేనాని ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న పేర్లలో ఇది ఒకటి. దీనికి కారణం ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో చురుకుదనం చూపించడంతో పాటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పాత్రను పోషించడమే అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిపి కూటమిని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయిన జనసేనాని.. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడంలో సఫలం అయ్యాడు. ఈ నేపథ్యంలో పవన్ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో మీరే చూసేయండి!
ప్రస్తుతం జరుగుతోన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 16 పూర్తయ్యే సరికి ఆయన 65 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో దూసుకుపోతున్నారు. ఆయనతో పాటు జనసేన నుంచి మరో 20 మంది అభ్యర్థులు కూడా విజయం దిశగా సాగుతున్నారు.

పవన్ కల్యాణ్ విజయం దాదాపుగా ఖరారు అయిపోయింది. మరో రెండు రౌండ్లలో తుది ఫలితం వెలువడబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని జనసేన కార్యకర్తలతో పాటు పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసంతో అతడి సతీమణి అన్నా లెజ్‌నేవా, కొడుకు అకీరా నందన్ సండది చేస్తున్నారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం సాధిస్తోన్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్‌నేవా, కొడుకు అకీరా నందన్ తమదైన రీతిలో సందడి చేశారు. ఇంటి ముందు ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











