పవన్ కల్యాణ్ చిన్న కూతురును చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో మీరే చూడండి.. పేరు ఏమిటో తెలుసా?
హిందువులు మహా ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూకు గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని టీటీడీ బోర్డు అపచారం తలపెట్టిందనే ఫుడ్ సెక్యూరిటీ సంస్థల నివేదికలు బయటకు రావడంతో సంచలనం రేపింది. కలియుగ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో తయారయ్యే తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు పదార్తాలు కలిపారనే విషయం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసింది. బాలాజీ సన్నిధిలో జరిగిన దారుణానికి శుద్ది చేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను పూర్తి చేపట్టారు. ఆ దీక్ష అనంతరం తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాలి నడకన వెళ్లి దీక్షను ముగించారు. ఈ సందర్భంగా తన కూతుళ్లతో కలిసి శ్రీవారిని దర్శించుకొన్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగిన అపచార శుద్దికి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్తం చేసుకొనేందుకు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఈ దీక్షను నిష్టతో కొనసాగించారు. దీక్ష పూర్తీ తర్వాత కాలినడన ఆక్టోబర్ 1వ తేదీన తిరుమలకు కాలినడకన చేరుకొన్నారు.

కాలినడకన పవన్ కల్యాణ్‌కు తోడుగా అధికారులు, ఆయన స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వెంట ఉన్నారు. అర్ధరాత్రి తిరుపతికి చేరుకొన్న ఆయన తన కూతుళ్లతో కలిసి శ్రీవారిని దర్శించుకొన్నారు. తన చిన్న కూతురు పొలీనా అంజనీ కొణిదెల మైనర్ కావడం, క్రిస్టియన్ మతాన్ని అనుసరించడంతో ఆమె తరుఫున స్వయంగా పవన్ కల్యాణ్ తన దస్తూరితో డిక్లరేషన్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. తన చిన్న కూతురు పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు అని టీటీడీ నిర్వాహకులు తెలిపారు.

పవన్ కల్యాణ్ పక్కనే కూర్చొని డిక్లరేషన్ మీద పొలీనా అంజనీ కొణిదెల సంతకం చేస్తున్న ఫోటోలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఆమె తొలిసారి కెమెరా ముందుకు, మీడియా ముందుకు రావడం చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్ కల్యాణ్ దిగిన ఫోటో వైరల్ అయింది. ఇద్దరు కూతుళ్లతో కలిసి చిరునవ్వు నవ్విన ఫోటోను అభిమానులు షేర్ చేసుకొంటున్నారు.
ఇదిలా ఉండగా, పవర్ స్టార్ పెద్ద కూతురు ఆద్య కొణిదెల, చిన్న కూతురు పొలీనా అంజనీ కొణిదెల ఇద్దరు దర్శనం అనంతరం ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకొంటూ వస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను కూడా అభిమానులు షేర్ చేసుకొంటున్నారు. చిన్న కూతురు అందంగా, హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అందర్నీ ఆకట్టుకొన్నారు.


Click it and Unblock the Notifications











