ఎంత ముద్దొస్తున్నాడో.. పవన్ కల్యాణ్ చిన్న కొడుకు ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంతానం అకీరా నందన్, ఆద్య గురించి అందరికి అంతో ఇంతో తెలుసు. కానీ తన భార్య అన్నా లెజ్‌నోవా పిల్లలను మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. తన పిల్లలు పాలెనా అంజనా పవనోవ్నా, మార్క్ శంకర్ పవనోవిచ్‌ను మీడియాకు చాలా దూరంగా ఉంచుతున్నారు. మార్క్ శంకర్ పవనోవిచ్‌ పుట్టిన సమయంలో మీడియాకు ఫోటోలను రిలీజ్ చేసినప్పుడు తప్ప.. మళ్లీ ఆ చిన్నారి ఎలా ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదు. తాజాగా సోషల్ మీడియాలో మార్క్ శంకర్ పవనోవిచ్‌ వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి.

Pawan Kalyns son Mark Shankar Pawanovich photos viral

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌‌ను ఇంటిలోని సభ్యులు ఆటాడిస్తున్న సమయంలో కొందరు వీడియోలో బంధించి యూట్యూబ్‌లో పెట్టగా విశేషంగా స్పందన కనిపించింది. మార్క్ శంకర్ పవనోవిచ్‌ ఇంటి బాల్కనీలో నవ్వుతూ ఆటాడుకొంటూ ముద్దుగా కనిపించారు. బాల్కనీలో ఇంటి సభ్యులు ఆటాడిస్తుండటంతో ఆనందంలో మునిగిపోయినట్టు కనిపించాడు. మార్క్ శంకర్ పవనోవిచ్‌ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే వరుస ప్రాజెక్టులతో సిద్దంగా ఉన్నారు. లాక్‌డౌన్ పరిస్థితులు చక్కబడిన తర్వాత సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే పవన్ నటించిన వకీల్ సాబ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X