తారక్ కూడా అలాంటి వాడే.. మూసుకుని కూర్చోండని నెటిజన్లపై హీరోయిన్ ఫైర్

ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ ఘోష్. ఊసరవెల్లి చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆపై టాలీవుడ్‌ను వదిలి.. బాలీవుడ్ బాట పట్టింది. అయితే అక్కడ ఎక్కువగా సినీ అవకాశాలు రాలేదు. అయితే పాయల్ ఘోష్ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ఫేమస్ అవుతోంది.

Recommended Video

Jr NTR Nepotism లో నుండి వచ్చిన వాడు కాదా ? మూసుకుని ఉండండి అంటూ ఓ రేంజ్‌లో హీరోయిన్ ఫైర్..!!

ఆ మధ్య మీరాచోప్రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదంతో పాయల్ వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్‌కు మద్దతుగా పాయల్ చేసిన ట్వీట్స్, ఆపై సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై స్పందించడం, బాలీవుడ్‌ను ఏకిపారేయడం, టాలీవుడ్ గొప్పదనాన్ని చెప్పడం, డిప్రెషన్ లోనయ్యానని తన గతం గురించి చెప్పడం ఇలా ప్రతీరోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా ఎన్టీఆర్‌, నెపోటిజంపై సంచలన కామెంట్స్ చేసింది.

ఎన్టీఆర్‌కు మద్దతుగా..

ఎన్టీఆర్‌కు మద్దతుగా..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రా వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, మహిళా కమీషన్ వద్దకు చేరింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పనిగట్టుకుని మీరా చోప్రాను టార్గెట్ చేయడం, తీవ్ర పదజాలంతో దూషించడం, బెదిరించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి. ఈ వివాదంలో పాయల్ ఎంటరై.. ఎన్టీఆర్‌కు మహిళలను ఎంతో గౌరవిస్తాడని చెప్పుకొచ్చింది.

సుశాంత్ మరణంపై..

సుశాంత్ మరణంపై..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడంపై పాయల్ ఎమోషనల్ అయింది. బాలీవుడ్ నెపోటిజం, బాలీవుడ్‌లో జరిగే అక్రమాలు, నెపోటిజంపై స్పందించింది. బాలీవుడ్ ఓ నరకమని, టాలీవుడ్, దక్షిణాది సినీ పరిశ్రమ ఎంతో గొప్పవని, స్వర్గం లాంటివని చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌ను వదిలి చాలా పెద్ద తప్పు చేశానని వాపోయింది.

షారుఖ్‌పై ప్రేమ ..

షారుఖ్‌పై ప్రేమ ..

పాయల్ ఘోష్ తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అభిమానుల కోరిక మేరకు లైవ్‌లోకి వచ్చి అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఆమెకు షారుఖ్ ఖాన్ అంటే ఎంత ఇష్టమో ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. తనకు ఇష్టమైన హీరో షారుఖ్ అని, దేవుడు వరం ఇస్తే.. ఆయనతో కలిసి స్క్రీన్‌పై రొమాన్స్ చేసే ఛాన్స్‌ను కోరుతానని తెలిపింది.

మూసుకుని కూర్చోండి..

మూసుకుని కూర్చోండి..

ఎన్టీఆర్ కూడా నెపోటిజం ప్రొడక్టే కదా అని చాలా మంది అంటున్నారని, తనకు మెసెజ్‌లు చేస్తున్నారని పాయల్ ఘోష్ చెప్పుకొచ్చింది. ఈ మేరకు వారిపై పాయల్ తీవ్ర స్థాయిలో మండిపడింది. తాను అతనికి మద్దతిస్తాని, ఆయన్ను తిట్టేవారికి కచ్చితంగా ఆయన గురించి ఏమీ తెలిసి ఉండదు. అతనో హార్డ్ షిప్ ఎంతో కష్టపడి వచ్చాడు.. మీరంతా మూసుకుని ఉండండి అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X