ఆడవాళ్లను ఎలా గౌరవించాలో ఎన్టీఆర్‌కు తెలుసు.. ఆమెకు కౌంటర్‌గా హీరోయిన్ కామెంట్స్

సెలెబ్రిటీలు సోషల్ మీడియాకు రావడం, ఫాలోవర్స్‌తో చాటింగ్ చేయడం, లైవ్ సెషన్స్‌లో పాల్గొనడం సర్వ సాధారణమే. అయితే ఒక్కోసారి అవి మిస్ ఫైర్ అవుతుంటాయి. ఒక్కో హీరో అభిమానులు హర్ట్ అయ్యే పరిస్థితి రావొచ్చు. సదరు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలు.. వేరే హీరో అభిమానులకు కౌంటర్ వేసినట్టు ఉండొచ్చు. ఇలానే మీరా చోప్రా చెప్పిన సమాధానం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ వివాదంలో చిన్మయి, కుష్బూ, పాయల్ ఘోష్ వంటి వారు కూడా ఎంటర్ అయ్యారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

మీరాచోప్రా వివాదం..

మీరాచోప్రా వివాదం..

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రా మధ్య జరుగుతున్న మాటల యుద్దం గురించి తెలిసిందే. ఎన్టీఆర్ ఎవ్వరో తెలీదని చెప్పడంతో ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇలాంటి అభిమానులతో సక్సెస్ అవుదామని అనుకుంటున్నావా? ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించి అంటూ వరుసగా ట్వీట్స్ చేస్తూ వస్తోంది మీరా చోప్రా.

కుష్బూ కౌంటర్..

కుష్బూ కౌంటర్..

ఈ వివాదంలోకి నాటి హీరోయిన్ కుష్బూ ఎంట్రీ ఇచ్చింది. అసలే ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన కుష్బూ అదిరిపోయే కౌంటర్ వేసింది. కొందరు మహిళలు ఎప్పటికి మారరు.. నేర్చుకోరు కూడా.. ఆ విషయంలో వాళ్ళు పేద వాళ్ళు.. అంటూ సెటైర్స్ వేసింది. తాజాగా మరో హీరోయిన్ కూడా ఎన్టీఆర్ గురించి కామెంట్ చేసింది.

Recommended Video

NTR Fans Trolls On Meerra Chopra || ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా పోలీస్ కేస్...!!
నెటిజన్లతో చిట్ చాట్...

నెటిజన్లతో చిట్ చాట్...

‘ప్రయాణం'తో సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది పాయల ఘోష్. ఆపై కొన్ని సినిమాలు చేసిన పాయల్.. ఎన్టీఆర్ ఊసరవెల్లిలో ఓ ముఖ్య పాత్రను పోషించింది. తాజాగా పాయల్ నెటిజన్లతో చిట్ చాట్ చేయగా.. ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.

ఎలా గౌరవించాలో తెలుసు..

ఎలా గౌరవించాలో తెలుసు..

ఎన్టీఆర్ గురించి చెప్పమని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు పాయల్ స్పందిస్తూ.. ‘సూపర్ టాలెంట్ ఉన్న నటుడే కాదు.. సూపర్ స్టార్ కూడా అంతేకాకుండా ఎంతో మంచి మనిషి. ఆయనకు ఆడవాళ్లను ఎలా గౌరవించాలో తెలుసు'అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఉన్న వివాదంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ కామెంట్స్ మీరా చోప్రాకు కౌంటర్‌గానే వచ్చాయని ఫ్యాన్స్ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X