2020లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. సోషల్ మీడియాలో పాయల్ ఘోష్ రచ్చ
ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ ఘోష్. కానీ ఊసరవెల్లి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా చేసిన పాత్రతోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది. అలా పాయల్ సినిమాలతో ఫేమస్ అయినా కూడా ఎవ్వరికీ అంతగా తెలియదు. కానీ 2020 మాత్రం పాయల్‌ను బాగా క్రేజ్ తెచ్చుకునేలా చేసింది. 2020లో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన తారల్లో పాయల్ ఘోష్ ఒకరు. ఆమె చేసిన ఎన్నో ట్వీట్లు, మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి.
మొదటగా మీరా చోప్రా ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్లతో పాయల్ ఘోష్ వార్తల్లోకి ఎక్కింది. ఎన్టీఆర్‌కు మద్దతుగా మాట్లాడటంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ పాయల్‌ను బాగా హైలెట్ చేసేశారు. అలా పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తోంది. అలా సుశాంత్ సింగ్ మరణంపై పాయల్ బాలీవుడ్‌ను ఏకిపారేసింది. టాలీవుడ్‌ను పొగుడుతూ.. బాలీవుడ్‌పై నిప్పులు చెరగడంతో ఇక్కడ బాగానే ఫేమస్ అయింది.

తాను కూడా డిప్రెషన్‌కు లోనయ్యానని, అయితే ఆ సమయంలో తనకు తన ఫ్యామిలీ అండగా నిలబడిందనిచెప్పుకొచ్చింది. అందుకే తాను బతికి బయట పడ్డానిన పాయల్ చెప్పుకొచ్చింది. ఇక డ్రగ్స్ కేసులోనూ పాయల్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అన్నింటి కంటే ముఖ్యంగా అనురాగ కశ్యప్‌పై మీటూ ఆరోపణలు చేయడంతో అన్ని ఇండస్ట్రీలు ఉలిక్కి పడ్డాయి. ప్రాజెక్ట్ కోసం పిలిస్తే వెళ్లానని, అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడని పాయల్ చేసిన ఆరోపణలు, తిరిగి అనురాగ్ కశ్యప్ ఖండించడం ఇలా అనేక వివాదాలతో పాయల్ 2020లో నిత్యం వార్తల్లో నిలుస్తూనే వచ్చింది.


Click it and Unblock the Notifications











