పాత్ర డిమాండ్ చేస్తే చివరకు అది కూడా చేస్తా.. దేవుడ్ని ఆ వరం అడుగుతానన్న పాయల్

ప్రయాణం చిత్రంతో సినీ కెరీర్‌ను మొదలు పెట్టింది పాయల్ ఘోష్. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాయల్ ఘోష్‌కు అవకాశాలు కూడా వచ్చాయి. మళ్లీ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెళ్లి సినిమాలో ఓ కీలక పాత్ర చేసి అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య పాయల్ మాత్రం వార్తల్లో తెగ నిలుస్తోంది. ఆ మధ్య ఎన్టీఆర్ మీరా చోప్రా వివాదం, సుశాంత్ మృతి, డిప్రెషన్‌లపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఆ విశేషాలేంటో ఓ సారిచూద్దాం.

 మంచు మనోజ్, ఎన్టీఆర్‌లపై..

మంచు మనోజ్, ఎన్టీఆర్‌లపై..

ప్రయాణం, ఊసరవెల్లి చిత్రాల్లో నటించిన పాయల్‌ను హీరోలతో పనిచేసిన అనుభవం గురించి నెటిజన్లు ప్రశ్నించారు. మనోజ్ చాలా మంచి వాడు. ఆయనతో కలిసి పనిచేయడం నాకిష్టం. ఎంతో సరదాగా ఉంటాడు.. సాయం చేస్తాడని తెలిపింది.

 ప్రభాస్ అంటే బాహుబలి..

ప్రభాస్ అంటే బాహుబలి..

స్మార్ట్, డాషింగ్, గుడ్ లుకింగ్, కోలీవుడ్‌లో ఫేవరేట్ స్టార్స్‌లో ఆయన కూడా ఒకరు. అని సూర్య గురించి చెప్పుకొచ్చింది. ప్రభాస్ గురించి చెప్పమంటే బాహుబలి అని సమాధానమిచ్చింది. ఇష్టమైన ఆట క్రికెట్ అని పేర్కొంది. ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు తన ఫ్యాన్స్‌తో మాట్లాడతానని తెలిపింది.

పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా?

పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా?

పాత్ర కోసం గుండు కొట్టించుకుంటారా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పాయల్ చెప్పిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంది. నాకు సినిమాలంటే పిచ్చి.. ఒకవేళ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే చివరకు దానికి కూడా సిద్దమేనని తెలిపింది. ఎంతైనా అమ్మాయిలకు జుట్టు అంటే ప్రేమ కానీ పాత్ర కోసం గుండు చేసుకోవడానికి కూడా వెనకడాదట.

ఆ వరం అడుగుతా..

ఆ వరం అడుగుతా..

ఒక వేళ దేవుడు కనిపించి ఓ వరం కావాలని అడిగితే ఏం కోరుకుంటారని ప్రశ్నిస్తే.. స్క్రీన్‌పై షారుఖ్ ఖాన్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని కల్పించమని కోరుతానని చెప్పుకొచ్చింది. ఎప్పటికీ తనకు ఇష్టమైన హీరో షారుఖ్ ఖానేనని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

Recommended Video

Sushant Singh Rajput : Netizens Change Their Mind On Shraddha Kapoor And Kriti Sanon
నెపోటిజం ఉంది..

నెపోటిజం ఉంది..

బాలీవుడ్‌లో నెపోటిజం ఉందా? అని ప్రశ్నిస్తే కచ్చితంగా ఉందని చెబుతూ.. కానీ ప్రేక్షకులు ఎంకరేజ్ చేయకూడదని తెలిపింది. సుశాంత్ మృతిపై స్పందిస్తూ.. ఇంకా నమ్మలేకపోతున్నాను.. కానీ జీవితం అంటే అదే.. ఏం జరిగినా అలా ముందుకు వెళ్లాల్సిందేనని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X